శాంతించిన టోకు ధరల ద్రవ్యోల్బణం

WPI inflation eases to 2.47percent  in March - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2018  మార్చి నెలలో స్వల్పంగా శాంతించింది. డబ్ల్యూపీఐ డేటాను గణాంకాలను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ  సోమవారం విడుదల చేసింది.  మార్చి నెలలో ఇది 8 నెలల కనిష్ట స్థాయిని నమోదు చేసింది. ఫిబ్రవరిలో 2.48 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం రేటు మార్చిలో స్వల్పంగా తగ్గి 2.47 శాతంగా నమోదైంది.   జనవరిలో 2.84 శాతంగా వుండగా, గత ఏడాది మార్చినెలలో ఇది 5.11 శాతంగా ఉంది.  ఆహారపదార్థాలు, ప్రత్యేకించి పప్పుధాన్యాలు, కూరగాయలు ధరలు చల్లబడటంతో  టోకుధరల ద్రవ్యోల్బణం కూడా ఆ మేరకు దిగి వచ్చింది.

ఏప్రిల్ 16, 2018 న విడుదల చేసిన ప్రభుత్వ డేటా ప్రకారం  ఆహార ద్రవ్యోల్బణం గత నెలలోని 0.88 శాతంతో పోలిస్తే మార్చి నెలలో 0.29 శాతానికి దిగివచ్చింది.  ప్రైమరీ ఆర్టికల్స్‌ 0.79 శాతం నుంచి 0.24 శాతానికి, మ్యానుఫ్యాక్చరింగ్‌ 3.04 శాతం నుంచి 3.03 శాతానికి తగ్గాయి.  కూరగాయల డిఫ్లేషన్ మార్చిలో 2.70 శాతంగా ఉంది. అయితే ఫ్యూయల్‌  అండ్‌ పవర్‌  ద్రవ్యోల్బణం మార్చిలో 4.70శాతానికి పెరిగింది. పెరిగింది, అంతకు ముందు నెలలో ఇది  3.81 శాతంగా ఉంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top