ఈయూతో భారత్ వాణిజ్య చర్చలు వాయిదా | With the postponement of the EUIndia trade talks | Sakshi
Sakshi News home page

ఈయూతో భారత్ వాణిజ్య చర్చలు వాయిదా

Aug 6 2015 12:35 AM | Updated on Sep 3 2017 6:50 AM

యూరోపియన్ యూనియన్‌తో (ఈయూ) విస్తృత స్థాయి పెట్టుబడులు, వాణిజ్య ఒప్పందంపై (బీటీఐఏ) యూరోపియన్

జీవీకే బయోసెన్సైస్ ‘ఔషధాల’ నిషేధానికి ప్రతిచర్య
 
 న్యూఢిల్లీ : యూరోపియన్ యూనియన్‌తో (ఈయూ) విస్తృత స్థాయి పెట్టుబడులు, వాణిజ్య ఒప్పందంపై (బీటీఐఏ) యూరోపియన్ యూనియన్‌తో జరగాల్సిన చర్చలను కేంద్రం వాయిదా వేసింది. జీవీకే బయోసెన్సైస్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించిన 700 ఫార్మా ఉత్పత్తులపై ఈయూ నిషేధం విధించడమే ఇందుకు కారణం. దీనిపై ఆందోళన వ్యక్తం చేసిన భారత్.. ప్రతిచర్యగా బీటీఐఏ చర్చలను వాయిదా వేసినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.

అనేక సంవత్సరాలుగా ఈ ఔషధాలు ఎలాంటి ప్రతికూల ప్రభావాలు లేకుండా అనేక సంవత్సరాలుగా ఈయూలో చెలామణీలో ఉన్నప్పటికీ వీటిని నిషేధించడం సరికాదని పేర్కొంది. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ఆగస్టు 28న భారత్-ఈయూ వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరగాల్సి ఉంది. భారత్-ఈయూల మధ్య వాణిజ్యం 2014-15లో దాదాపు 99 బిలియన్ డాలర్లుగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement