ఓపెనింగ్ రోజే షియోమికి 5 కోట్ల రెవెన్యూలు | With Mi Home, Xiaomi rakes in revenue of Rs 5 crore in first 12 hours | Sakshi
Sakshi News home page

ఓపెనింగ్ రోజే షియోమికి 5 కోట్ల రెవెన్యూలు

May 23 2017 4:26 PM | Updated on Sep 5 2017 11:49 AM

ఓపెనింగ్ రోజే షియోమికి 5 కోట్ల రెవెన్యూలు

ఓపెనింగ్ రోజే షియోమికి 5 కోట్ల రెవెన్యూలు

చైనా ఎలక్ట్రానిక్, మొబైల్ తయారీ దిగ్గజం షియోమికి ఇటీవల పెరుగుతున్న క్రేజ్ అంతా ఇంతా కాదు.

చైనా ఎలక్ట్రానిక్, మొబైల్ తయారీ దిగ్గజం షియోమికి ఇటీవల పెరుగుతున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మార్కెట్లో షియోమి ప్రొడక్ట్ర్ లు సంచలనాలు సృష్టిస్తున్నాయి. దీంతో ఆఫ్ లైన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోనూ తన సత్తా చాటేందుకు ఎంఐ హోమ్ స్టోర్ పేరుతో షియోమి వచ్చేసింది.  మే 20న షియోమి తన తొలి ఎంఐ హోమ్ స్టోర్ ను బెంగళూరులో ప్రారంభించింది. ప్రారంభించిన 12 గంటల్లోనే ఎంఐ హోమ్ కు 5 కోట్ల రెవెన్యూలు వచ్చి, రికార్డులు సృష్టించాయి. 10వేల మందికి పైగా కస్టమర్లు ఓపెనింగ్ డే రోజు ఎంఐ హోమ్ స్టోర్ వద్ద షియోమి ఫోన్లు, ఎకో సిస్టమ్ ఉత్పత్తులు, యాక్ససరీస్ కొనుగోలు చేసినట్టు కంపెనీ ప్రకటించింది.
 
ఈ రెవెన్యూల్లో ఎక్కువగా టాప్ సెల్లింగ్ రెడ్ మి ఫోన్లు రెడ్ మి4, రెడ్ మి 4ఏ, రెడ్ మి నోట్4ల నుంచే వచ్చినట్టు కంపెనీ తెలిపింది. దీనిలో  ఆడియో ఆక్ససరీస్, ఎంఐ వీఆర్ ప్లే, ఎంఐ ఎయిర్ ఫ్యూరిఫైయర్ 2, కొత్తగా లాంచ్ చేసిన ఎంఐ రూటర్ 3సీ, ఎంఐ బ్యాండ్ 2లు కూడా ఉన్నాయి. చైనా, హాంకాంగ్ వంటి మార్కెట్ల తర్వాత ఎంఐహోమ్ స్టోర్ ను ఏర్పాటుచేసిన భారత మార్కెట్ ఐదవది. దీనిలో స్మార్ట్ ఫోన్లు, పవర్ బ్యాంక్స్, హెడ్ ఫోన్లు, ఫిట్ నెస్ బ్యాండ్లు, ఎయిర్ ఫ్యూరిఫైయర్స్, ఇతర ఎకో సిస్టమ్ ప్రొడక్ట్ లు దొరుకుతాయి. వచ్చే రెండేళ్లలో 100 ఎంఐ హోమ్ స్టోర్లను  ఏర్పాటుచేయాలని షియోమి ప్లాన్ చేస్తోంది.  ఎంఐ హోమ్ స్టోర్లు తర్వాత వచ్చే మెట్రో సిటీల్లో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నైలు ఉన్నాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement