మొబైల్‌లో సంక్షిప్త వార్తలు | way 2 new app lounch for mobile news | Sakshi
Sakshi News home page

మొబైల్‌లో సంక్షిప్త వార్తలు

Dec 31 2015 1:37 AM | Updated on Sep 3 2017 2:49 PM

మొబైల్‌లో సంక్షిప్త వార్తలు

మొబైల్‌లో సంక్షిప్త వార్తలు

వివిధ పత్రికలు, చానెళ్లలో వచ్చిన ముఖ్య వార్తలను సంక్షిప్త రూపంలో 400 అక్షరాలకు మించకుండా అందిస్తారు.

వే2 నుంచి 9 భాషల్లో అందుబాటులో
కంపెనీ వ్యవస్థాపకులు రాజు వనపాల
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:
  వివిధ పత్రికలు, చానెళ్లలో వచ్చిన ముఖ్య వార్తలను సంక్షిప్త రూపంలో 400 అక్షరాలకు మించకుండా అందిస్తారు. పూర్తి వార్తను చదవాలనుకునేవారు శీర్షికపై క్లిక్‌చే స్తే చాలు. తెలుగు, హిందీ, ఇంగ్లీషు, మరాఠి, మలయాళం, తమిళం, బెంగాళీ, కన్నడ, గుజరాతీ భాషల్లో సేవలు అందుబాటులోకి తెచ్చారు.
 
  హైలైట్స్ అయితే మొబైల్‌కు అలర్ట్ కూడా వస్తుంది. వే2 యాప్ నుంచి ఉచితంగా ఎస్‌ఎంఎస్‌లు పంపుకునే సౌకర్యం ఎలాగూ ఉంది. ఆన్‌డ్రాయిడ్‌తోపాటు ఐఓఎస్ మొబైల్ అప్లికేషన్‌ను కంపెనీ పరిచయం చేసింది. నెటిజన్లలో వార్తలు చదివేవారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో సంక్షిప్త వార్తల సేవలను పరిచయం చేశామని సంస్థ వ్యవస్థాపకులు రాజు వనపాల బుధవారమిక్కడ మీడియాకు తెలిపారు.  వే2 డౌన్‌లోడ్స్ ప్రతిరోజు 15,000 పైగా నమోదవుతున్నాయని రాజు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement