ఫ్లిప్‌కార్ట్‌ డీల్‌ : నేడు భారత్‌ బంద్‌కు పిలుపు | Walmart-Flipkart Deal  : Traders Give Call For Bharat Bandh On Friday | Sakshi
Sakshi News home page

ఫ్లిప్‌కార్ట్‌ డీల్‌ : నేడు భారత్‌ బంద్‌కు పిలుపు

Sep 28 2018 12:03 PM | Updated on Sep 28 2018 1:07 PM

Walmart-Flipkart Deal  : Traders Give Call For Bharat Bandh On Friday - Sakshi

పుణే : అమెరికాకు చెందిన రిటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌, దేశీయ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ను కొనుగోలు చేయడాన్ని మొదట్నుంచి దేశీయ వర్తకులు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ డీల్‌ ప్రభావం వర్తకులపై, చిన్న వ్యాపారాలపై తీవ్ర చూపనుందని ఆరోపిస్తూ వస్తున్నారు. తాజాగా ఈ డీల్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ.. కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ట్రేడర్లు(సియాట్‌) నేడు భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చారు. రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌కు చెందిన స్వదేశీ జాగ్రన్ మంచ్ కూడా భారత్‌ బంద్‌కు మద్దతు తెలిపింది. ఈ డీల్‌తో మల్టి-బ్రాండ్‌ రిటైల్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు బ్యాక్‌డోర్‌ నుంచి దేశంలోకి ప్రవేశిస్తాయని ట్రేడర్లు చెబుతున్నారు. ‘ఫ్లిప్‌కార్ట్‌-వాల్‌మార్ట్‌ డీల్‌ దేశీయ ఎఫ్‌డీఐ పాలసీకి వ్యతిరేకంగా ఉంది. ఇది ఏడు కోట్ల ట్రేడర్లు, దేశంలోని చిన్న వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది’ అని సియాట్‌ జనరల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ఖండేల్వాల చెప్పారు. 

భారత్‌లోకి ఎఫ్‌డీఐల ప్రవేశాన్ని తాము అడ్డగించడం లేదని, కానీ వాల్‌మార్ట్‌, అమెజాన్‌తో పోటీపడేలా బలవంతం చేసేముందు, భారతీయ ట్రేడర్లకు కూడా ఆ స్థాయిలో మైదానం కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నట్టు సియాట్‌ కోఆర్డినేటర్‌ అజిత్‌ సేథియా అన్నారు. స్వదేశీ జాగ్రన్‌ మంచ్‌ కూడా మల్టి-బ్రాండ్‌ రిటైల్‌లో ఎఫ్‌డీఐను వ్యతిరేకిస్తోంది. అంతేకాక ఫ్లిప్‌కార్ట్‌ ఆర్థిక వ్యవహారాలపై విచారణ జరిపించాలని డిమాండ్‌ కూడా చేస్తోంది. నేషనల్‌ కంపెనీ లా అప్పీలెంట్‌ ట్రిబ్యునల్‌లో వాల్‌మార్ట్‌-ఫ్లిప్‌కార్ట్‌ డీల్‌కు చెందిన కేసు విచారిస్తున్న సందర్భంగా భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చారు. వాల్‌మార్ట్‌ ట్రిబ్యునల్‌ ముందు తన స్పందనలు కూడా తెలిపింది. ఈ విషయంపై విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, ఈడీని, ఆర్‌బీఐని, సీసీఐని డిమాండ్‌ చేస్తున్నామని స్వదేశీ జాగ్రన్‌ మంచ్‌ కో-కన్వీనర్‌ అశ్వాని మహాజన్‌ అన్నారు. మల్టి బ్రాండులో ఎఫ్‌డీఐలు, ఎంటర్‌ప్రిన్యూర్‌షిప్‌ను దెబ్బతీస్తాయని, వ్యవసాయదారులకు వ్యతిరేకంగా ఉంటాయని, ఉద్యోగాల సృష్టిని కూడా హరింపజేస్తాయని స్వదేశీ జాగ్రన్‌ మంచ్‌ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement