మార్కెట్లోకి మరో సూపర్‌ టీవీ వచ్చేసింది

Vu 100 Super TV With 4K 100-Inch Panel, Windows 10 Support Launched  - Sakshi

వు 100 సూపర్‌ టీవీ ధర రూ. 8 లక్షలు

సాక్షి, ముంబై: దేశీయ టీవీ మార్కెట్‌లో సూపర్‌ టీవీ లాంచ్‌ చేసింది. ప్రపంచంలోనే తొలి 100 అంగుళాల 4కే ఎల్‌ఈడీ టీవీ భారత మార్కెట్‌లోకి లాంచ్‌ చేసిన వూ కంపెనీ  దీనికి అప్‌గ్రేడెడ్‌గా వు 100 సూపర్‌ టీవీ పేరుతో మరో కొత్త టీవీని లాంచ్‌ చేసింది. ఆండ్రాయిడ్‌, విండోస్‌ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌ ఆధారంగా ఈ టీవీలను తీసుకొచ్చింది. ఈ టీవీ వచ్చే వారం నుండి భారతీయ వినియోగదారుల కోసం కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.  ఈ 100 అంగుళాల 4 కె  సూపర్ టీవీ ధర  అక్షరాలా రూ. 8 లక్షలు. 

వు 100 సూపర్ టీవీ ఫీచర్లు
100 అంగుళాల 4కె డిస్‌ప్లే  
ఆండ్రాయిడ్, విండోస్ 10  ఆధారం
ఇంటెల్ కోర్ ఐ 3 ,  కోర్ ఐ 5 ప్రాసెసర్  ఆప‍్షన్స్‌
4జీబీ డిడిఆర్ ర్యామ్/ 120జీబీ ఆన్‌బోర్ట్‌  స్టోరేజ్

టీవీ ట్యూనర్ టెక్నాలజీన, స్కైప్‌ కాల్స్, వైర్‌లెస్‌  క్వార్ట్లీ కీబోర్డ్‌, ఎయిర్ మౌస్‌, రిమోట్ కంట్రోల్‌, డాల్బీ, డిటిఎస్ ఆడియో సపోర్ట్, ఇన్‌బిల్ట్ వూఫర్, 2,000 వాట్ల సౌండ్ అవుట్‌పుట్‌తో జెబీఎల్ స్పీకర్లు లాంటివి ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. మెరుగైన మల్టీమీడియా అనుభవాన్ని అందించే ఈ సూపర్‌ టీవీ కనెక్టివిటీ పరం​గా, మూడు యుఎస్‌బి పోర్ట్‌లు, బ్లూటూత్ వి 5.0, హెచ్‌డిఎంఐ,ఎవి, వైపిబిపిఆర్,ఆర్‌ఎఫ్ సపోర్ట్‌లతో పనిచేస్తుంది. లగ్జరీ, టెక్నాలజీ చాలా సాధారణంగా మారిన ప్రస్తుత తరుణంలో భారతదేశంలో ప్రీమియం టీవీ విభాగంలో లీడర్‌గా వుండటం గర్వంగా ఉందని వు టెలివిజన్ ఛైర్మన్ దేవితా సరాఫ్‌ తెలిపారు. అంతేకాదు దేశవ్యాప్తంగా ఉన్న తమ వినియోగదారులకు అధిక నాణ్యత, విలాసవంతమైన వీక్షణ అనుభవాలను అందించడం కొనసాగించాలని ఆశిస్తున్నామన్నారు. 

కాగా వూ టెలివిజన్‌ ఇటీవల తన అల్ట్రా ఆండ్రాయిడ్ టీవీని భారతదేశంలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ టీవీ సిరీస్ అమెజాన్ ఇండియా ద్వారా అందుబాటులో ఉంది. ఇవి మూడు వేర్వేరు స్క్రీన్ పరిమాణాలలో(32 అంగుళాల మోడల్ రూ.11,499కు, 40 అంగుళాల టీవీ రూ.18,999కు లభిస్తుంది. 43 అంగుళాల టీవీ రూ .20,999) లభిస్తుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top