వోల్వో వీ40 క్రాస్ కంట్రీ.. పెట్రోల్ వెర్షన్ | Volvo V40 Cross Country petrol launched in India at Rs 27 lakh | Sakshi
Sakshi News home page

వోల్వో వీ40 క్రాస్ కంట్రీ.. పెట్రోల్ వెర్షన్

Apr 21 2015 1:47 AM | Updated on Sep 3 2017 12:35 AM

వోల్వో వీ40 క్రాస్ కంట్రీ.. పెట్రోల్ వెర్షన్

వోల్వో వీ40 క్రాస్ కంట్రీ.. పెట్రోల్ వెర్షన్

స్వీడన్‌కు చెందిన లగ్జరీ కార్ల కంపెనీ వోల్వో ఆటో ఇండియా(వీఏఐ) సోమవారం వీ40 క్రాస్ కంట్రీ పెట్రోల్ వేరియంట్‌ను...

ధర రూ. 27 లక్షలు
ముంబై: స్వీడన్‌కు చెందిన లగ్జరీ కార్ల కంపెనీ వోల్వో ఆటో ఇండియా(వీఏఐ) సోమవారం వీ40 క్రాస్ కంట్రీ పెట్రోల్ వేరియంట్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ధర రూ.27 లక్షలు(ఎక్స్ షోరూమ్, ముంబై) అని వోల్వో ఇండియా ఎండీ థామస్ ఎర్న్‌బెర్గ్ చెప్పారు.  టీ4 ఇంజిన్, 1.6 జీడీటీఐ(గ్యాసోలిన్ టర్బోచార్జ్‌డ్ డెరైక్ట్ ఇంజెక్షన్) 4 సిలిండర్‌తో రూపొందిన ఈ కారులో  6 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ తదితర ఫీచర్లున్నాయని వివరించారు. సోమవారం నుంచే ఈ కార్ల విక్రయాలను దేశవ్యాప్తంగా ఉన్న తమ వోల్వో డీలర్షిప్‌ల ద్వారా ప్రారంభించామని పేర్కొన్నారు.

2013 జూన్‌లో వీ40 క్రాస్ కంట్రీలో డీజిల్ వేరియంట్‌ను భారత్‌లోకి తెచ్చామని, మంచి స్పందన లభించిందని, ఆ ఉత్సాహంతోనే ఇప్పుడు పెట్రోల్ వేరియంట్‌ను అందిస్తున్నామని తెలిపారు. అధిక అమ్మకాల కోసం ధరను ఆకర్షణీయంగా నిర్ణయించామని పేర్కొన్నారు. భారత్‌లో  పెట్రోల్, డీజిల్ వేరియంట్‌లలో లభిస్తున్న ఏకైక వోల్వో కారు ఇదే కావడం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement