breaking news
Luxury car company
-
లగ్జరీ కారు .. స్పెషల్ గేరు..
లగ్జరీ కార్ల కంపెనీలు మరింత పర్సనలైజ్డ్ అనుభూతిని అందించే కార్లతో సంపన్న కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో భాగంగా స్పెషల్, లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్లను ప్రవేశపెడుతున్నాయి. తద్వారా భారీ మార్జిన్లుండే సెగ్మెంట్లో వాటాను పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. దేశీయంగా రూ. 50 లక్షలకు పైగా ఉండే లగ్జరీ కార్ల మోడల్స్ గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 51,500 యూనిట్లు అమ్ముడైనట్లు పరిశ్రమ వర్గాల అంచనా. అయితే, శాతాలపరంగా వృద్ధి గత మూడేళ్ల కనిష్టమైన 3.3 శాతానికే పరిమితమైంది. అంతర్జాతీయంగా అనిశ్చితులు, స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతుండటం వంటి అంశాలు ఇందుకు కారణంగా నిల్చాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో 55.3 శాతం వృద్ధి చెందిన లగ్జరీ కార్ల అమ్మకాలు 2024 ఆర్థిక సంవత్సరంలో 16.7 శాతంగా నమోదయ్యాయి. తాజా గా ఇది గణనీయంగా పడిపోవడంతో కొత్త మార్గాలను అన్వేషిస్తున్న కంపెనీలు.. లిమిటెడ్ ఎడిషన్ల బాట పట్టాయి. హెచ్ఎన్ఐల జోరు .. భారత్‌లో 1 కోటి డాలర్ల పైగా (సుమారు రూ. 85 కోట్లు) సంపద ఉన్న అత్యంత సంపన్నుల సంఖ్య గణనీయంగా పెరు గుతుండటంతో లగ్జరీ బ్రాండ్లు.. సదరు సంపన్నులపై మరింతగా దృష్టి పెడుతున్నాయి. నైట్ ఫ్రాంక్ నివేదిక ప్రకారం గతేడాది అత్యంత సంపన్నుల (హెచ్ఎన్ఐ) సంఖ్య 6 శాతం పెరిగి 85,698కి చేరింది. సంపన్న కస్టమర్లు తమ హోదాను, అంతస్తును ప్రతిబింబించే కార్లను కోరు కుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మె ర్సిడెస్–బెంజ్, బీఎండబ్ల్యూ, జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్), మినీలాంటి ఆటో దిగ్గజాలు తమ ప్రస్తుత మోడల్స్‌లో స్పెషల్ ఎడిషన్లు, హైపర్ కస్టమైజ్డ్ వెర్షన్లను ప్రవేశపెడుతున్నాయి. లగ్జరీ కార్ల సెగ్మెంట్లో దాదాపు 45 శాతంవాటాతో మెర్సిడెస్ బెంజ్ అగ్రగామిగా ఉంటోంది. తర్వాత స్థానాల్లో బీఎండబ్ల్యూ, జేఎల్ఆర్, ఆడి మొదలైనవి ఉన్నాయి. టాప్ ఎండ్ కస్టమర్లు ప్రీమియం అనుభూతి కోసం మరింత ఎక్కువ చెల్లించేందుకు సుముఖంగా ఉంటుండటంతో, ఈ కార్ల కంపెనీలు కొత్త ఆవిష్కరణలకు తెర తీస్తున్నాయి. ఈ ఏడాది మార్చిలో టాటా మోటార్స్‌లో భాగమైన జేఎల్ఆర్ కొత్తగా డిఫెండర్ ఆక్టా పేరిట తమ స్టాండర్డ్ డిఫెండర్‌కి సంబంధించిన ప్రత్యేక వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. దీని ధర రెగ్యులర్ మోడల్‌తో పోలిస్తే దాదాపు 50 శాతం అధికంగా రూ. 2.59 కోట్లు పలికింది. ఎక్స్‌క్లూజివ్ పెయింట్ షేడ్స్, కస్టమైజ్డ్ ఇంటీరియర్స్, పర్ఫార్మెన్స్ అప్‌గ్రేడేషన్ మొద లైన ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. మెర్సిడెస్–బెంజ్ సంస్థ మరింత వ్యక్తిగతీకరించడంపై ఫోకస్ పెడుతోంది. తమ టాప్ ఎండ్ లగ్జరీ కస్టమర్లు, సేకరణకర్తలకు హైపర్–పర్సనలైజేషన్ అంశం చాలా కీలకంగా ఉంటోందని మెర్సిడెస్ బెంజ్ వర్గాలు తెలిపాయి. తమ మాన్యుఫ్యాక్టర్ శ్రేణి, ఇతరత్రా ప్రత్యేక ఎడిషన్లకు అసాధారణ డిమాండ్ కనిపించిందని పేర్కొన్నాయి. ఏఎంజీ జీ63 గ్రాండ్ ఎడిషన్‌లో ప్రవేశపెట్టిన మొత్తం 25 యూనిట్లు కేవలం కొద్ది నిమిషాల వ్యవధిలో అమ్ముడైపోయినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. దీని ధర రూ. 4 కోట్లు. ఇక ఈ ఏడాది మార్చి 17న ప్రవేశపెట్టిన మేబ్యాక్ ఎస్ఎల్ 680 మోనోగ్రామ్ సిరీస్‌ను ఉదయం ప్రవేశపెడితే సాయంకాలానికల్లా మొత్తం బుక్ అయిపోయాయి. రెండు రోజుల క్రితమే కొంపెనీ కొత్తగా ఏఎంజీ జీ63 ‘కలెక్టర్స్ ఎడిషన్’ను ఆవిష్కరించింది. దీని ధర రూ. 4.3 కోట్లు. కేవలం 30 యూనిట్లే విక్రయిస్తున్నట్లు సంస్థ తెలిపింది. చాలాకాలంగా తాము కార్ల కస్టమైజేషన్‌ను అందిస్తున్నామని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ సంతోష్ అయ్యర్ తెలిపారు. కలెక్టర్స్ ఎడిషన్‌ను బెంగళూరులోని మెర్సిడెస్–బెంజ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇండియా (ఎంబీఆర్‌డీఐ)తో కలిసి, భారత పరిస్థితులకు అనుగుణంగా కంపెనీ రూపొందించింది. మరికొన్ని బ్రాండ్లను చూస్తే ఎం340ఐ మోడల్‌ను బీఎండబ్ల్యూ రూ. 75,90,000కు విక్రయిస్తోంది. ఇప్పటివరకు 1,000 పైగా యూనిట్లు అమ్ముడయ్యాయి. మరోవైపు రేంజ్ రోవర్ రణ్‌థంబోర్ ప్రత్యేక ఎడిషన్ రేటు రెగ్యులర్ వెర్షన్‌తో పోలిస్తే రూ. 43 లక్షలు అధికంగా రూ. 4.98 కోట్లకు (ఎక్స్–షోరూం) అమ్ముడయ్యింది. మొత్తం 12 వాహనాలూ అమ్ముడైపోయాయి. అటు మినీ కూపర్ ఎస్ జాన్ కూపర్ ధర రూ. 55,90,000గా ఉండగా, మొదటి లాట్ స్వల్ప వ్యవధిలోనే అమ్ముడైపోయింది.ఉభయతారకంగా .. వినూత్నంగా తీర్చిదిద్దిన ఇంటీరియర్స్, లుక్‌తో ఈ మోడల్స్ అత్యంత మెరుగైన పనితీరు కనపర్చేవిగా ఉంటాయని జేఎల్ఆర్ ఇండియా వర్గాలు తెలిపాయి. ఇలా లిమిటెడ్ ఎడిషన్లు, స్పెషల్ ఎడిషన్ మోడల్స్‌ను ప్రవేశపెట్టడమనేది ఇటు కంపెనీలకు, అటు కస్టమర్లకు .. రెండు వర్గాలకూ ప్రయోజనకరమైన విషయమని ఎస్ అండ్ పీ గ్లోబల్ మొబిలిటీ డైరెక్టర్ పునీత్ గుప్తా తెలిపారు. సదరు మోడల్ జీవితకాలాన్ని, కొనుగోలుదార్లను పెంచుకునేందుకు ఇది కంపెనీలకు ఉపయోగపడుతుంది. అదే సమయంలో ఓవరాల్ లుక్, ఫీల్, ఇంటీరియర్స్, పనితీరుపరంగా ఒక విశిష్టమైన గుర్తింపు పొందడమనేది కస్టమర్లకు ప్రయోజనకరమైన అంశంగా ఉంటుంది. తక్కువ మొత్తం పెట్టుబడితో అధిక మార్జిన్లను పొందే అవకాశం ఉండటంతో కంపెనీలకూ ఆదాయాలపరంగా బాగుంటోంది.కొన్ని కార్లు.. → డిఫెండర్ ఆక్టా ధర రూ. 2.59 కోట్లు → రేంజ్‌రోవర్ రణ్‌థంబోర్ రేటు రూ. 4.98 కోట్లు → మెర్సిడెస్ మేబ్యాక్ ఎస్ఎల్ 680 మోనోగ్రామ్ సిరీస్ ధర రూ. 4.2 కోట్లు → ఏఎంజీ జీ63 కలెక్టర్స్ ఎడిషన్ రూ. 4.3 కోట్లు -
10,000 మార్కుకు బీఎండబ్ల్యూ–మినీ
ముంబై: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న బీఎండబ్ల్యూ గ్రూప్ భారత్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది. 17 ఏళ్ల కంపెనీ చరిత్రలో బీఎండబ్ల్యూ, మినీ బ్రాండ్లు దేశీయంగా 10,000 యూనిట్ల మార్కును తొలిసారిగా దాటాయి. గతేడాదితో పోలిస్తే 2024 జనవరి–సెప్టెంబర్ మధ్య 10 శాతం వృద్ధితో 10,556 యూనిట్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. ఇందులో 10,056 బీఎండబ్ల్యూ, 500 యూనిట్లు మినీ బ్రాండ్‌లో విక్రయించింది. 2023 జనవరి–సెపె్టంబర్ మధ్య రెండు బ్రాండ్లలో కలిపి మొత్తం 9,580 యూనిట్లు రోడ్డెక్కాయి. మోటరాడ్ బ్రాండ్‌లో 5,638 యూనిట్ల మోటార్‌సైకిల్స్ సైతం అమ్ముడయ్యాయని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్, సీఈవో విక్రమ్ పావా తెలిపారు. బీఎండబ్ల్యూ, మినీ బ్రాండ్లలో ఈ ఏడాది 725 ఎలక్ట్రిక్ వాహనాలు రోడ్లపై పరుగుతీస్తున్నాయని చెప్పారు. భారత్‌లో లగ్జరీ కార్ల రంగంలో 2,000 యూనిట్ల ఈవీల అమ్మకాల మార్కును దాటిన తొలి కంపెనీగా స్థానం సంపాదించామన్నారు. బీఎండబ్ల్యూ భారత్‌లో శుక్రవారం ఎం4 సీఎస్ లగ్జరీ స్పోర్ట్స్ కారును ప్రవేశపెట్టింది. ధర ఎక్స్‌షోరూంలో రూ.1.89 కోట్లు. -
మెర్సిడెస్ బెంజ్ రికార్డు విక్రయాలు..
న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ గత ఆర్థిక సంవత్సరంలో నెలవారీ, త్రైమాసికాలవారీ, పూర్తి సంవత్సరంవారీగా రికార్డు అమ్మకాలు నమోదు చేసింది. జనవరి–మార్చి త్రైమాసికంలో అత్యధికంగా 5,412 వాహనాలను విక్రయించింది. గత మార్చి త్రైమాసికంలో నమోదైన 4,697 యూనిట్లతో పోలిస్తే ఇది 15 శాతం అధికం. ఇక ఆర్థిక సంవత్సరం వారీగా అమ్మకాలు 10 శాతం పెరిగి 16,497 యూనిట్ల నుంచి 18,123 యూనిట్లకు చేరాయి. నెలవారీ అమ్మకాలకు సంబంధించి మార్చిలో అత్యధిక స్థాయిలో విక్రయించినట్లు సంస్థ ఎండీ సంతోష్ అయ్యర్ తెలిపారు. 30 ఏళ్ల క్రితం భారత్‌లో తాము కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుంచి ఇవి అత్యుత్తమ గణాంకాలని వివరించారు. 2024లో 9 కొత్త వాహనాలను ఆవిష్కరిస్తున్నట్లు, వీటిలో 3 బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలు ఉండనున్నట్లు చెప్పారు. -
నానో.. ఫెరారీ 'సవారీ'!
అవసరం - సౌకర్యం - విలాసం. అడ్రస్ బట్టి మారిపోతాయి. ఒకచోట అవసరమైనది... మరోచోట విలాసం. ఒకచోట విలాసమైతే.... మరోచోట అనవసరం కూడా!! కారు కూడా అంతే. ఒకపుడు చాలామందికి విలాసం. వారి స్థాయికి గుర్తు. ఇపుడైతే అత్యధికులకు అవసరం. కొందరికైతే అత్యవసరం. మరి ఆ కార్లకు పెట్టే ధరెంత? కొందరైతే లక్షల్లో. మరి కొందరైతే కోట్లలో. అందుకే! మారుతి-800తో మొదలైన భారత దేశ కార్ల ప్రస్థానం... అలా అలా బుగట్టీ, రోల్స్ రాయిస్, బెంట్లీ, ఆస్టిన్ మార్టిన్, ఫెరారీ, లాంబోర్గిణి, బీఎండబ్ల్యూలను దాటిపోతోంది. నిజానికి కారు కొనేటపుడు అత్యధికులు చూసేది దాని ధర, మైలేజీ. ఈ రెండిటి తరవాత ఫీచర్లు. కాకపోతే పిండి కొద్దీ రొట్టె. డబ్బు కొద్దీ కారు. ఈ ధరను బట్టే... ఫీచర్లు, మైలేజీ అన్నీ మారిపోతుంటాయి. లక్ష రూపాయలకేనంటూ సామాన్యుల అవసరాలు తీర్చడానికి నానో ప్రత్యక్షమైతే... నేను కొందరికే సొంతం అంటూ రూ.38 కోట్ల బుగట్టీ వేరన్ రోడ్డుమీదికొస్తుంది. రూ.3 లక్షలు పెడితే మీ కుటుంబాన్నంతటినీ మోస్తానంటూ మారుతి ఆల్టో దేశానికి దగ్గ రైతే... రూ.8 కోట్లకు తక్కువ కాదంటూ రోల్స్‌రాయిస్ పాంథమ్ రోడ్డును మింగేస్తుంది. దేని ధర దానిదే. దేని ఫీచర్లు దానివే. దేని మైలేజీ దానిదే. ఒక్కమాటలో చెప్పాలంటే... దేనికదే సాటి. ఆ స్పెషాలిటీల సమాహారమే... ఈ ప్రాఫిట్ ప్లస్ ప్రత్యేక కథనం... - హైదరాబాద్, బిజినెస్ బ్యూరో ♦ చిన్నకార్ల కొనుగోళ్లలో ధరకే ఓటు ♦ మైలేజీ, ఫీచర్లు పెంచుతూ కంపెనీల ఎంట్రీ ♦ రూ.10 లక్షల లోపు కార్ల సెగ్మెంట్లో పోటాపోటీ ♦ దేశంలో కంపెనీల ఫోకస్ మొత్తంగా ఈ సెగ్మెంట్‌పైనే ♦ లగ్జరీ కార్ల కంపెనీల రూటే వేరు ♦ ప్రత్యేకమైన కస్టమర్ల కోసం ప్రత్యేక కార్లు ♦ బుక్ చేశాక కనీసం 4 నుంచి 8 నెలల దాకా వెయిటింగ్ ♦ దేశంలో అంతకంతకూ పెరుగుతున్న లగ్జరీ కార్లు ‘లక్ష’ నానోతో టాటా హల్చల్... టాటా గ్రూప్‌లో భాగమైన టాటా మోటార్స్... ముంబై కేంద్రంగా 1945లో ప్రారంభమైంది. ప్రపంచ కార్ల కంపెనీల్లో దీనిది 17వ స్థానం. అంతర్జాతీయ లగ్జరీ బ్రాండ్లు జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ను 2008లో ఇది ఫోర్డ్ నుంచి కొనుగోలు చేసింది. స్పెయిన్‌కు చెందిన బస్, కోచ్ తయారీ సంస్థ హిస్పానో, దక్షిణ కొరియాకు చెందిన కమర్షియల్ వెహికల్ తయారీ సంస్థ డీవో కూడా టాటా అనుబంధ సంస్థలే. సంస్థకు దేశంలో జంషెడ్పూర్, పట్నానగర్, లక్నో, సణంద్, ధార్వాడ్, పుణెతో పాటు అర్జెంటీనా, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్, యూకేలో ప్లాంట్లున్నాయి. 2008లో లక్ష రూపాయలకేనంటూ నానోను విడుదల చేసింది. ప్రస్తుతం ఆ ధర 2 లక్షలు దాటింది. 800 నుంచి మొదలు పెడితే... ఒకప్పుడు మారుతీ అంటే దేశీ కంపెనీ. ఇప్పుడిది జపాన్‌కు చెందిన సుజుకీ చేతుల్లో ఉంది. మొదట్లో మారుతీ ఉద్యోగ్ లిమిటెడ్‌గా పిలిచిన ఈ సంస్థ... మారుతీ800తో దేశంలో తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. 2016 జనవరి నాటికి మన దేశీ కార్ల పరిశ్రమలో 47 శాతం వాటా దీనిదే. 1981లో మారుతీ ఉద్యోగ్ ఆరంభమైనా... తొలి 800 కారు బయటికొచ్చింది మాత్రం 1983లో. దేశంలో గుర్గావ్, మానేసర్‌లోని ప్లాంట్లలో సంస్థ ఏటా 14.50 లక్షల కార్లు ఉత్పత్తి చేస్తోం ది. ప్రస్తుతం ఈ సంస్థ హై ఎండ్ కార్ల మార్కెట్లో కూడా విస్తరిస్తోంది. పోటాపోటీగా... హ్యుందాయ్ 1967 డిసెంబర్లో దక్షిణ కొరియాలో ఆరంభమైన హ్యుందాయ్... ఇపుడు ప్రపంచంలోనే 4వ అతిపెద్ద కార్ల కంపెనీ. కొరియాలోని ఉల్సాన్లో దీనికి ప్రపంచంలోనే అతిపెద్ద కార్ల తయారీ ప్లాంటుంది. దాన్లో ఏటా 16 లక్షల కార్లు ఉత్పత్తి అవుతాయి. ప్రపంచవ్యాప్తంగా 193 దేశాల్లో విక్రయాలు సాగిస్తున్న ఈ సంస్థ... 1968లో ఫోర్డ్‌తో కలిసి రూపొందించిన ‘కోర్టినా’తో తన ప్రస్థానాన్ని ఆరంభించింది. దేశంలో చెన్నైలోని శ్రీపెరంబుదూర్‌లో ఉన్న ప్లాంట్ నుంచి ఏటా 6 లక్షల కార్లు ఉత్పత్తి చేస్తోంది. 2007లో హైదరాబాద్ అభివృద్ధి, పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించింది. చౌక కార్లలోనూ డెట్రాయిట్ దిగ్గజం! ఒకనాటి నవలల్లో ‘చెవర్లెట్ కారు’ అని ముద్దుగా పిలిచినా... అసలు పేరు షెవర్లే. అమెరికన్ దిగ్గజం జనర ల్ మోటార్స్ విభాగ మిది. 1911లో స్విస్ రేస్ కార్ డ్రైవర్ లూయీ షెవర్లే, ఫైనాన్సింగ్ పార్టనర్ విలియం సి డురంట్‌తో కలిసి మిషిగన్‌లో ఈ కంపెనీని ఆరంభించా రు. ప్రస్తుతం 140 దేశాలకు విక్రయించిన షెవర్లే వాటా... మన దేశంలో 3 శాతం. గుజరాత్‌లోని హలోల్‌లో ప్లాంట్ ఏర్పాటు చేసిన ఈ సంస్థ... 2014లో 24 వేల కార్లను ఉత్పత్తి చేసింది. క్రూజ్, ఆస్ట్రా, టవేరా తప్ప మిగిలివన్నీ జపాన్ నుంచి దిగుమతి అవుతున్నవే. జేఎల్ఆర్ను వదులుకున్నా.... ఫోర్డ్ మోటార్స్‌ను 1903లో హెన్రీ ఫోర్డ్ మిషిగన్‌లో ప్రారంభించారు. కార్లు, కమర్షియల్ వాహనాలను ‘ఫోర్డ్’ బ్రాండ్‌తో, లగ్జరీ కార్లను ‘లిన్‌కోల్న్’ బ్రాండ్‌తో విక్రయిస్తోంది. కొన్ని విదేశీ కార్ల కంపెనీలనూ కొనుగోలు చేసిన ఈ సంస్థ... జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ను మాత్రం టాటాలకు విక్రయించేసింది. జపాన్‌కు చెందిన మజ్దాలో 2.1 శాతం, యూకేకు చెందిన ఆస్టిన్ మార్టిన్‌లో 8 శాతం, చైనాకు చెందిన జింగ్లింగ్లో 49 శాతం వాటా దీనికున్నాయి. దేశంలో గుజరాత్‌లోని సణంద్‌లో ఫోర్డ్ ఇంజిన్, అసెంబ్లింగ్ ప్లాంటుంది. బుగట్టి వేరన్గ్రాండ్ స్పోర్ట్స్ దేశంలో అత్యంత ఖరీదైన కారు ఇది. బుక్ చేశాక డెలివరీకి 6-8 నెలలు పడుతుంది. అది కూడా కస్టమర్ల స్థాయిని బట్టి!!. 100 కి.మీ. వేగాన్ని అందుకోవడానికి కేవలం 2.7 సెకన్లు పడుతుందంటేనే... దీని ప్రత్యేకత అర్థమైపోతుంది. కారులోని ప్రతి అంగుళం ప్రత్యేకమైందే. కార్బన్ ఫైబర్ మోనోకోక్యూతో కారు బాడీ తయారవుతుంది. ⇒ ఖరీదు రూ.38 కోట్లు. ⇒ 8.7 లీటర్ల ఇంజిన్ సామర్థ్యం దీని సొంతం ⇒ 987 బీహెచ్పీ పవర్ : 6,000 ఆర్పీఎం ⇒ 1,250 ఎన్ఎం టార్క్ : 2,200-5,500 ఆర్పీఎం ⇒ 7 స్పీడ్ డీఎస్జీ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ⇒ గరిష్ట వేగం గంటకు 407 కి.మీ. ⇒ మైలేజ్ లీటరుకు సిటీలో 2.3 కి.మీ. - హైవేలో 6.8 కి.మీ. ⇒ ఇంధన ట్యాంక్ సామర్థ్యం 100 లీటర్లు ఆస్టిన్ మార్టిన్ వాన్క్విష్ ⇒ ధర రూ.3.8 కోట్లు ⇒ ఏఎం 29 వీ12 ఇంజిన్ ⇒ 565 బీహెచ్పీ : 6,750 ఆర్పీఎం ⇒ 620 ఎన్ఎం టార్క్ : 5500 ఆర్పీఎం ⇒ 6 స్పీడ్ గేర్ బాక్స్ ⇒ గరిష్ట వేగం గంటకు 295 కి.మీ. ⇒ జీరో నుంచి 100 కి.మీ.లకు చేరుకోవటానికి పట్టే సమయం 4.3 సెకన్లు ⇒ ఇంధన సామర్థ్యం 78 లీటర్లు ⇒ మైలేజీ లీటర్‌కు సిటీలో: 4 కి.మీ., హైవేలో: 8 కి.మీ. రోల్స్ రాయిస్ ఫాంథమ్ సిరీస్-2 ఫాంథమ్ను మొదటిసారి మ్యాగజైన్ల మీద ప్రకటనల్లో కాకుండా నేరుగా చూసినవారెవరైనా... నోరెళ్లబెట్టాల్సిందే. ఎందుకంటే ఫాంథమ్ పాంథా రోడ్డు మీద వెళ్తుంటే కారు ముందు, వెనక ఇరుసులు రోడ్డును మింగేస్తున్నట్టుగా కనిపిస్తాయి. 5.9 సెకన్లలో 100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ⇒ స్టాండర్డ్ వీల్ బేస్ ధర రూ.8 కోట్లు; ఎక్స్టెండెడ్ వీల్ బేస్ ధర రూ.9 కోట్లు ళీ రెండు వర్షన్లూ 6.7 లీటర్ వీ-2 పెట్రోల్ ఇంజిన్. ⇒ 453 బీహెచ్పీ పవర్ : 5,350 ఆర్పీఎం; 720 ఎన్ఎం టార్క్ : 3,500 ఆర్పీఎం ళీ 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ షిఫ్ట్; దీని గరిష్ట వేగం గంటకు 240 కి.మీ. ⇒ ఇంధన ట్యాంక్ కెపాసిటీ 100 లీటర్లు; మైలేజీ లీటరుకు సిటీలో: 4.38 కి.మీ.-హైవేలో 9.8 కి.మీ. లంబోర్గిణి అవెంటడార్ మూడు సెకన్లలో 100 కి.మీ. వేగాన్ని అందుకునే ఈ కారు ధర... రూ.5.36 కోట్లు ⇒ 6,498 సీసీ పెట్రోల్ ఇంజిన్ ⇒ 7 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ షిఫ్ట్ ⇒ 690.62 బీహెచ్పీ : 8,250 ఆర్పీఎం ⇒ 690 ఎన్ఎం : 5,500 ఆర్పీఎం ⇒ గరిష్ట వేగం గంటకు 350 కి.మీ. ⇒ ఇంధన ట్యాంక్ సామర్థ్యం 90 లీటర్లు ⇒ మైలేజీ లీటర్‌కు సిటీలో: 3 కి.మీ., హైవేలో 5 కి.మీ. బెంట్లీ ముల్సన్నే దేశంలో పెట్రోల్ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉన్న ఈ కారు... 100 వేగాన్ని 5.3 సెకన్లలో చేరుకుంటుంది. ⇒ ధర రూ.7.5 కోట్లు. ⇒ 6.8 లీటర్ వీ 8 ఇంజిన్ ట్విన్ టర్బో చార్జ్డ్ ⇒ 505 బీహెచ్పీ : 4,200 ఆర్పీఎం ⇒ 8 స్పీడ్ ఆటో మేటిక్ గేర్ షిఫ్ట్ ⇒ టార్క్ 1,020 ఎన్ఎం : 1,750 ఆర్పీఎం ⇒ గరిష్ట వేగం గంటకు 296 కి.మీ. ⇒ ఇంధన ట్యాంక్ కెపాసిటీ 96 లీటర్లు ⇒ మైలేజీ లీటర్‌కు సిటీలో: 4.3 కి.మీ. ⇒ హైవేలో: 10.1 కి.మీ. బెంట్లీ ఫ్లయింగ్ స్పౌర్ మన దేశంలో ఫ్లయింగ్ స్పౌర్.. వీ 8, డబ్ల్యూ 12 వేరియంట్స్ అనే రెండు పెట్రోల్ వెర్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ⇒ వీ8 ధర రూ.3.2 కోట్లు; 5,988 సీసీ 4 లీటర్ ఇంజిన్ సామర్థ్యం ⇒ 500 బీహెచ్పీ : 6000 ఆర్పీఎం ⇒ 660 ఎన్ఎం : 1,700 ఆర్పీఎం టార్క్ ⇒ 8 స్పీడ్ ఆటో గేర్ బాక్స్; గరిష్ట వేగం గంటకు 295 కి.మీ. ⇒ 3.2 సెకన్లలో వంద కి.మీ. వేగానికి చేరుకుంటుంది. ⇒ మైలేజీ లీటర్‌కు సిటీలో 4.5 కి.మీ., హైవేలో 10.2 కి.మీ. ⇒ ఇంధన ట్యాంక్ సామర్థ్యం 90 లీటర్లు రోల్స్ రాయిస్ రైత్ ⇒ ధర రూ.4.6 కోట్లు ⇒ ట్విన్ టర్బో వీ-12 ఇంజిన్ ⇒ 8 స్పీడ్ ఆటోమేటిక్ జెడ్ఎఫ్ ట్రాన్స్మిషన్ ⇒ 6,592 సీసీ ఇంజిన్ ⇒ 624 బీహెచ్పీ : 5,600 ఆర్పీఎం ⇒ 800 ఎన్ఎం : 1,500-5,000 ఆర్పీఎం ⇒ 100 కి.మీ. వేగాన్ని చేరుకోవటానికి పట్టే సమయం 4.6 సెకన్లు. ⇒ గరిష్ట వేగం గంటకు 250 కి.మీ.; ఇంధన ట్యాంక్ సామర్థ్యం 83 లీటర్లు ⇒ మైలేజీ లీటరుకు సిటీలో: 4.7 కి.మీ., హైవేలో: 10.2 కి.మీ. పోర్షే 911 టర్బో ఎస్ ⇒ ధర రూ.3 కోట్లు ⇒ బుక్ చేసిన 7-10 నెలల సమయానికి కారు డెలివరీ అవుతుంది. ⇒ 3.1 సెకన్లలో సున్నా నుంచి వంద కి.మీ. వేగానికి చేరుకుంటుంది. ⇒ 3.8 లీటర్ 24 వీ పెట్రోల్ ఇంజిన్ సామర్థ్యం ⇒ 560 బీహెచ్పీ : 5,750 ఆర్పీఎం ⇒ 700 ఎన్ఎం టార్క్ : 2,100-4,500 ఆర్పీఎం ⇒ 7 స్పీడ్ గేర్ బాక్స్; గరిష్ట వేగం గంటకు 318 కి.మీ. ⇒ మైలేజీ లీటర్‌కు సిటీలో 7.46 కి.మీ., హైవేలో 12.8 కి.మీ. ⇒ ఇంధన ట్యాంక్ సామర్థ్యం 68 లీటర్లు ఫెరారీ కాలిఫోర్నియా ⇒ ధర రూ.3-5 కోట్లు ⇒ ట్విన్ క్లచ్ గేర్ బాక్స్ ⇒ 4.3 లీటర్ వీ8 ఫ్రంట్ ఇంజిన్ సామర్థ్యం ⇒ 482.7 బీహెచ్పీ : 7,750 ఆర్పీఎం; 505 ఎన్ఎం : 5,000 ఆర్పీఎం ⇒ గరిష్ట వేగం గంటకు 312.2 కి.మీ. ⇒ 7 స్పీడ్ ఆటో షిఫ్ట్‌తో మాన్యువల్ గేర్స్/ఆటోమేటిక్ రెండూ ఉంటాయిందులో. ⇒ 3.7 సెకన్లలో వంద కి.మీ. వేగానికి చేరుకుంటుంది. ⇒ మైలేజీ లీటర్‌కు సిటీలో 4.32 కి.మీ., హైవేలో 7.75 కి.మీ. ⇒ ఇంధన ట్యాంక్ కెపాసిటీ 73 లీటర్లు గమనిక: బీహెచ్పీ: బ్రేక్ హార్స్ పవర్; ఆర్పీఎం: రివల్యూషన్స్ పర్ మినట్; ఎన్ఎం: నానో మీటర్; టార్క్: ఫోర్స్ (బలం); భారతదేశంలో కార్ల కోసం అత్యధికులు పెట్టే బడ్జెట్ రూ.10 లక్షల లోపే. అందుకే ప్రతి కంపేని ఈ సెగ్మెంట్లోనే మోడళ్లను తెస్తోంది. వాటి పోటీ కూడా ఈ సెగ్మెంట్లోనే. మారుతీ, హ్యుందాయ్, టాటా. రెనో, నిస్సాన్, షెవర్లే, హోండా, ఫోర్డ్, ఫోక్స్‌వ్యాగన్, టొయోటా.. ఇలా అన్ని కంపెనీల పోరూ ఈ సెగ్మెంట్లోనే. కాకపోతే మారుతీ, హ్యుదాయ్, టాటాల వాటా ఎక్కువ. రూ.10లక్షల లోపు మోడళ్ల ఫీచర్లు, మైలేజీ తదితర వివరాలను చూస్తే... -
మెర్సిడెస్ బెంజ్ ‘లోకల్’ జీఎల్ఏ ఎస్యూవీ
♦ ధర 2 లక్షల వరకూ తగ్గుతుంది ♦ మూడో అసెంబ్లింగ్ లైన్ ఆరంభం పుణే: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల కంపెనీ మెర్సిడెస్ బెంజ్ గురువారం జీఎల్ఏ ఎస్యూవీను మార్కెట్లోకి తెచ్చింది. 60 శాతం స్థానికంగా తయారైన విడిభాగాలతోనే ఈ కారును తయారు చేశామని మెర్సిడెస్ బెంజ్ కంపెనీ తెలిపింది. భారత్‌లోనే అసెంబుల్ చేసిన తమ ఆరవ మోడల్ ఇదని మెర్సిడెస్-బెంజ్ ఇండియా ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇబెర్‌హర్డ్ కెర్న్ చెప్పారు. ఇక్కడకు సమీపంలోని చకన్ ప్లాంట్‌లో మూడవ అసెంబ్లీ లైన్‌ను లాంఛనంగా ప్రారంభించామని పేర్కొన్నారు. దిగుమతి చేసుకున్న జీఎల్ఏ ఎస్‌యూవీల ధర రూ.31.31-34.25 లక్షల రేంజ్లో ఉంటాయని, ఇక ఇప్పుడు వీటిని స్థానికంగానే అసెంబుల్ చేస్తున్నందున వీటి ధరలు రూ.1.5 లక్షల నుంచి రూ.2.5 లక్షల వరకూ తగ్గుతాయని వివరించారు. భారత్‌లో తమ వార్షిక అసెంబ్లింగ్ సామర్థ్యం 10 వేల కార్లని, రూ.150 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేసిన ఈ మూడో అసెంబ్లీ లైన్‌తో ఈ సంఖ్య రెట్టింపై 20,000కు చేరుతుందని పేర్కొన్నారు. ఇంత ఎక్కువ స్థాయి స్థాపిత ఉత్పాదక సామర్థ్యమున్న ఏకైక లగ్జరీ కంపెనీ తమదేనని పేర్కొన్నారు. భారత్‌లో 1994 నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని, ఇప్పటిదాకా రూ.1,000 కోట్లు పెట్టుబడులు పెట్టామని వివరించారు. భారత్‌లో ఇంత ఎక్కువగా పెట్టుబడులు పెట్టిన ఏకైక లగ్జరీ కార్ల కంపెనీ కూడా తమదేనని పేర్కొన్నారు. -
వోల్వో వీ40 క్రాస్ కంట్రీ.. పెట్రోల్ వెర్షన్
ధర రూ. 27 లక్షలు ముంబై: స్వీడన్‌కు చెందిన లగ్జరీ కార్ల కంపెనీ వోల్వో ఆటో ఇండియా(వీఏఐ) సోమవారం వీ40 క్రాస్ కంట్రీ పెట్రోల్ వేరియంట్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ధర రూ.27 లక్షలు(ఎక్స్ షోరూమ్, ముంబై) అని వోల్వో ఇండియా ఎండీ థామస్ ఎర్న్బెర్గ్ చెప్పారు. టీ4 ఇంజిన్, 1.6 జీడీటీఐ(గ్యాసోలిన్ టర్బోచార్జ్డ్ డెరైక్ట్ ఇంజెక్షన్) 4 సిలిండర్‌తో రూపొందిన ఈ కారులో 6 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ తదితర ఫీచర్లున్నాయని వివరించారు. సోమవారం నుంచే ఈ కార్ల విక్రయాలను దేశవ్యాప్తంగా ఉన్న తమ వోల్వో డీలర్‌షిప్‌ల ద్వారా ప్రారంభించామని పేర్కొన్నారు. 2013 జూన్‌లో వీ40 క్రాస్ కంట్రీలో డీజిల్ వేరియంట్‌ను భారత్‌లోకి తెచ్చామని, మంచి స్పందన లభించిందని, ఆ ఉత్సాహంతోనే ఇప్పుడు పెట్రోల్ వేరియంట్‌ను అందిస్తున్నామని తెలిపారు. అధిక అమ్మకాల కోసం ధరను ఆకర్షణీయంగా నిర్ణయించామని పేర్కొన్నారు. భారత్‌లో పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభిస్తున్న ఏకైక వోల్వో కారు ఇదే కావడం గమనార్హం. -
భారత్‌లో అత్యంత ఖరీదైన బీఎండబ్ల్యూ కారు
ఐ8 @ రూ.2.29 కోట్లు ముంబై: లగ్జరీ కార్ల కంపెనీ బీఎండబ్ల్యూ కొత్త హైబ్రిడ్ లగ్జరీ కారు, బీఎండబ్ల్యూ ఐ8ను బుధవారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ ఫోర్ వీల్ డ్రైవ్ కారును బీఎండబ్ల్యూ బ్రాండ్ అంబాసిడర్ సచిన్ టెండూల్కర్ ఆవిష్కరించారు. ఈ కారు ధర రూ.2.29 కోట్లు(ఎక్స్ షోరూమ్, ముంబై) అని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ ఫిలిప్ వాన్ తెలిపారు. భారత్‌లో తామందిస్తున్న అత్యంత ఖరీదైన బీఎండబ్ల్యూ కారు ఇదేనని, బీఎండబ్ల్యూ తొలి హైబ్రిడ్ మోడల్ కూడా ఇదేనని పేర్కొన్నారు. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 131 హెచ్‌పీ ఎలక్ట్రిక్ ఇంజిన్లు ఉన్న ఈ డ్యుయల్ ఇంజిన్ కారు 47 కి.మీ. కంబైన్డ్ మైలేజీని ఇస్తుందని వివరించారు. గంటకు వంద కిలోమీటర్ల వేగాన్ని 4.4 సెకన్లలోనే అందుకుంటుందని పేర్కొన్నారు. ఈ కారు గరిష్ట వేగం 230 కిమీ అని ఆయన తెలిపారు.