వొడాఫోన్‌ రోజుకు 4.5 జీబీ డేటా | Vodafone takes on Jio offers 126GB of 4G data at Rs 799 | Sakshi
Sakshi News home page

వొడాఫోన్‌ రోజుకు 4.5 జీబీ డేటా

Feb 24 2018 6:06 PM | Updated on Feb 24 2018 6:06 PM

Vodafone takes on Jio offers 126GB of 4G data at Rs 799 - Sakshi

వొడాఫోన్‌ ఇండియా (ఫైల్‌ ఫోటో)

దేశంలో రెండో అతిపెద్ద టెలికాం ప్రొవైడర్‌ వొడాఫోన్‌, రిలయన్స్‌ జియోకి గట్టి పోటీ ఆఫర్‌ని ప్రకటించింది. 799 రూపాయలతో సరికొత్త ప్యాక్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఈ ప్యాక్‌ డైరెక్ట్‌ జియో రూ.799 ప్లాన్‌కు పోటీగా ఉంది.  జియో తన రూ.799 ప్లాన్‌ కింద రోజుకు 5జీబీ డేటా ఆఫర్‌ చేస్తుండగా... దీని కంటే 0.5 జీబీ తక్కువగా రోజుకు 4.5జీబీ డేటాను ఆఫర్‌ చేయనున్నట్టు వొడాఫోన్‌ తెలిపింది. ఈ ప్యాక్‌ వాలిడిటీ 28 రోజులు. దీంతో మొత్తంగా 28 రోజుల పాటు 126 జీబీ డేటా యూజర్లకు లభించనుంది. అదనంగా అపరిమిత లోకల్‌, ఎస్టీడీ కాల్స్‌, రోమింగ్స్‌ కాల్స్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితంగా లభించనున్నాయి. 

రూ.549తో కూడా వొడాఫోన్‌ మరో ప్లాన్‌ను ఆవిష్కరించింది. ఈ ప్లాన్‌ కింద రోజుకు 3.5జీబీ డేటాను వొడాఫోన్‌ ఆఫర్‌ చేయనుంది. దీనిపై కూడా ఇతర ప్రయోజనాలు అపరిమిత లోకల్‌, ఎస్టీడీ, రోమింగ్‌ వాయిస్‌ కాల్స్‌ ఉచితం. రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా యూజర్లు పొందనున్నారు. మొత్తంగా యూజర్లకు 28 రోజులకు 98జీబీ డేటా అందుబాటులోకి రానుంది.  

వొడాఫోన్‌ ఇటీవలే రూ.158 ప్లాన్‌ను పునరుద్ధరించింది. ఈ ప్లాన్‌ కింద కూడా 28 రోజులకు అపరిమిత వాయిస్‌ కాల్స్‌, 1జీబీ 3జీ లేదా 4జీ డేటాను వొడాఫోన్‌ ఆఫర్‌ చేస్తోంది. అయితే ఈ ప్లాన్‌పై రోజుకు 250 నిమిషాలు, వారానికి 1000 నిమిషాలు మాట్లాడుకునే అవకాశం మాత్రమే ఉంటుంది. ఈ ప్లాన్‌ కూడా డైరెక్ట్‌ జియో రూ.149 ప్లాన్‌కు గట్టి పోటీగా ఉంది. ప్రీపెయిడ్‌ యూజర్ల కోసం ప్రత్యేకంగా రూ.151 సూపర్‌ప్లాన్‌ను కూడా వొడాఫోన్‌ ఆఫర్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు ప్లాన్స్‌ కూడా కేవలం కేరళ సర్కిల్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement