
మాల్యా... బోర్డు నుండి తప్పుకోండి: యూబీ
సెబీ నిషేధం నేపథ్యంలో నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవి నుంచి తప్పుకోవాలంటూ విజయ్ మాల్యాకు యునైటెడ్ బ్రూవరీస్ సూచించింది.
న్యూఢిల్లీ: సెబీ నిషేధం నేపథ్యంలో నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవి నుంచి తప్పుకోవాలంటూ విజయ్ మాల్యాకు యునైటెడ్ బ్రూవరీస్ సూచించింది. సెబీ ఆదేశాలను నిలుపుదల చేసే ఉత్తర్వులేవీ రాకపోవడంతో తక్షణం తప్పుకోవాలని కోరాల్సి వస్తోందంటూ మాల్యాకు రాసిన ఈ–మెయిల్‌లో పేర్కొంది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ ఆయనకు బోర్డు సమావేశాల సమాచారం, ఇతరత్రా కీలక వివరాలేమీ తెలియజేయబోమంటూ స్టాక్ ఎక్సే్చంజీలకు యునైటెడ్ బ్రూవరీస్ తెలియజేసింది.