మీడియాపై మాల్యా సెటైర్లు | Vijay Mallya intends to attend all ICC Champions Trophy matches to cheer team India | Sakshi
Sakshi News home page

మీడియాపై మాల్యా సెటైర్లు

Jun 6 2017 4:02 PM | Updated on Apr 8 2019 8:07 PM

మీడియాపై మాల్యా సెటైర్లు - Sakshi

మీడియాపై మాల్యా సెటైర్లు

భారీరుణ ఎగవేతదారుడు పారిశ్రామికవేత్త విజయమాల్యా (61)మళ్లీ ట్విట్టర్‌ అందుకుని మీడియాపై సెటైర్లు వేశాడు.

న్యూఢిల్లీ: భారీరుణ ఎగవేతదారుడు పారిశ్రామికవేత్త విజయమాల్యా (61)మళ్లీ ట్విట్టర్‌ అందుకుని మీడియాపై సెటైర్లు వేశాడు.  చాంపియన్స్ ట్రోఫీ భారత్-పాకిస్థాన్  మ్యాచ్‌ కు  ఆదివారం హాజరు కావడంపై భారత మీడియాలో వచ్చిన కథనాలపై ఆయన వ్యంగ్యంగా స్పందించాడు. ఈ మీడియా కవరేజీ అద్భుతమని సెటైర్లు వేస్తూ ట్వీట్ చేశాడు. తన హాజరు గురించి విస్తృతమైన సంచలనాత్మక మీడియా కవరేజ్  ఇచ్చిందనీ, అయితే భారత క్రికెట్ జట్టును ఉత్సాహపరచేందుకు అన్ని మ్యాచ్‌‌లకూ  హాజరయ్యే ప్లాన్స్‌లో ఉన్నట్టు  చెప్పాడు. అంతేకాదు  పనిలో పనిగా భారత  క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీపై  ప్రశంసలు కురిపించాడు.  విరాట్ కోహ్లీ ప్రపంచ స్థాయి ప్లేయర్ అని,  వరల్డ్‌ క్లాస్‌ కెప్టెన్‌, వారల్డ్‌ క్లాస్‌  లీడరని మాల్యా కితాబిచ్చాడు.   బ్రావో కోహ్లీ అంటూ ట్విట్‌ చేశాడు.  

కాగా వివిధ బ్యాంకులకు రూ. 9 వేల కోట్లకుపైగా రూపాయల బాకీ పడ్డ లిక్కర్‌ కింగ్‌​ మాల్యా  బ్రిటన్‌కు చెక్కేశాడు. సిబిఐ రెండు కేసులను నమోదు చేసింది.  అటు మాల్యా ను తిరిగి ఇండియాకు రప్పించే చర్యలను కేంద్ర ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో లండన్‌లో  బ్రిటిష్‌ అధికారులు అతణ్ని  అరెస్ట్‌ చేయగా  బెయిల్‌ మీద ఉన్నారు. అయితే  మాల్యా ఎడ్జ్‌ బాస్టన్‌ లో జరిగిన ఇండో-పాక్‌ మ్యాచ్‌ సందర్భంగా   వీఐపీ లాంజ్‌లో  మ్యాచ్‌ను తిలకిస్తున్న వైనంపై మీడియా హైప్‌ సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన సంగతి తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement