డీఆర్టీ ఉత్తర్వుపై డియాజియో అభ్యంతరం | Vijay Mallya Case: Diageo Plc files objections against DRT Order | Sakshi
Sakshi News home page

డీఆర్టీ ఉత్తర్వుపై డియాజియో అభ్యంతరం

Apr 6 2016 1:47 AM | Updated on Sep 3 2017 9:16 PM

రుణ ఎగవేత వివాదాన్ని ఎస్‌బీఐతో పరిష్కరించుకునే దాకా లిక్కర్ కింగ్ విజయ్‌మాల్యాకు చెల్లించాల్సిన 75 మిలియన్ డాలర్లను

బెంగళూరు: రుణ ఎగవేత వివాదాన్ని ఎస్‌బీఐతో పరిష్కరించుకునే దాకా లిక్కర్ కింగ్ విజయ్‌మాల్యాకు చెల్లించాల్సిన 75 మిలియన్ డాలర్లను  విడుదల చేయవద్దని తనకు డెట్ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్‌టీ) ఇచ్చిన ఆదేశాలపై బ్రిటిష్ లిక్కర్ దిగ్గజం- డియాజియో మంగళవారం తన అభ్యంతరాలను దాఖలు చేసింది. యునెటైడ్ స్పిరిట్స్ సంస్థ నుంచి వైదొలిగినందుకుగాను ఆయనకు 75 మిలియన్ డాలర్లు చెల్లించేందుకు డియాజియో సిద్ధపడిం ది. ఇచ్చిన రుణంలో కొంతైనా రికవర్ అయ్యేలా ఈ నిధులు ముందుగా తమకు దఖలుపడేలా ఆదేశించాలంటూ డీఆర్‌టీని ఆశ్రయించింది ఎస్‌బీఐ. దీనికి సానుకూల రూలింగ్‌ను డీఆర్‌టీ గతనెల్లో జారీ చేసింది. దీనిపై తాజాగా డియాజియో, దాని అనుబంధ రెండు కంపెనీలు తమ తరఫు అభ్యంతరాలను దాఖలు చేశాయి. కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 13వ తేదీకి వాయిదా పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement