
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ట్యాక్సీ సేవల సంస్థ ఉబెర్.. నిరంతర భద్రతా హెల్ప్‌లైన్ సేవలను ప్రారంభించింది. డ్రైవర్ల దుష్ప్రవర్తన, బ్రేక్ డౌన్స్, డ్రైవర్లతో వివాదం వంటి సమస్యలకు వెంటనే పరిష్కారం పొందడం కోసం కంపెనీ ఇన్‌హౌస్ సేఫ్టీ టీమ్‌తో మాట్లాడే వెసులుబాటును కల్పిస్తోంది. చండీగఢ్‌లో మార్చి నుంచి ప్రయోగాత్మకంగా నడుస్తోన్న ఈ సేవలను మంగళవారం నుంచి దేశవ్యాప్తంగా విస్తరించామని కంపెనీ సెంట్రల్ ఆపరేషన్స్ హెడ్ పవన్ వైష్ వెల్లడించారు. యాప్ వినియోగదారులకు ఎస్‌ఓఎస్ బటన్ ఇప్పటికే అందుబాటులో ఉండగా.. నూతన సేవలు మరింత భద్రతా కల్పించనున్నాయని పేర్కొన్నారు.