బజాజ్‌ అలయంజ్‌ నుంచి రెండు కొత్త ఉత్పాదనలు! | Two new products from Bajaj Allianz! | Sakshi
Sakshi News home page

బజాజ్‌ అలయంజ్‌ నుంచి రెండు కొత్త ఉత్పాదనలు!

Nov 16 2018 12:56 AM | Updated on Nov 16 2018 12:56 AM

Two new products from Bajaj Allianz! - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: రెండు కొత్త పాలసీలను తమ సంస్థ తేనున్నదని, అవి ఐఆర్‌డీఏ అనుమతి కోసం ఎదురు చూస్తున్నాయని బజాజ్‌ అలయంజ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ అపాయింటెడ్‌ యాక్చువరీ సాయి శ్రీనివాస్‌ ధూలిపాళ తెలిపారు. ఇందులో ఒకటి యులిప్‌ పాలసీ అని వెల్లడించారు. ప్రస్తుతం కంపెనీ మొత్తం 25 రకాల పాలసీలను అందుబాటులో ఉంచిందని గురువారమిక్కడ మీడియాకు చెప్పారు. ‘‘ఏప్రిల్‌–సెప్టెంబరు మధ్య ఇండివిడ్యువల్‌ విభాగంలో లైఫ్‌ ఇన్సూరెన్స్‌ మార్కెట్‌ 9.9 శాతం వృద్ధిని నమోదు చేసింది.

ప్రైవేటు కంపెనీలు 11.4 శాతం, బజాజ్‌ 12.7 శాతం వృద్ధి కనబరిచింది. క్యూ2లో న్యూ బిజినెస్‌ ప్రీమియం 24% అధికమైంది. పాలసీ సగటు టికెట్‌ సైజు రూ.39,895 నుంచి రూ.54,636లకు ఎగసింది. ఇండివిడ్యువల్‌ న్యూ బిజినెస్‌ ప్రీమియం రెండవ త్రైమాసికంలో రూ.280 కోట్ల నుంచి రూ.346 కోట్లకు చేరింది. రెన్యువల్‌ ప్రీమియం 17 శాతం వృద్ధితో రూ.870 కోట్లుగా ఉంది. మొత్తం ప్రీమియం రూ.2,015 కోట్ల నుంచి రూ.2,083 కోట్లకు వచ్చి చేరింది’ అని వివరించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement