టీవీఎస్‌ మోటార్‌ లాభం రూ.147 కోట్లు | TVS Motor Q1 net profit up 13% at Rs 147 cr | Sakshi
Sakshi News home page

టీవీఎస్‌ మోటార్‌ లాభం రూ.147 కోట్లు

Aug 8 2018 12:51 AM | Updated on Aug 8 2018 12:51 AM

TVS Motor Q1 net profit up 13% at Rs 147 cr - Sakshi

న్యూఢిల్లీ: టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌–జూన్‌ క్వార్టర్‌లో రూ.147 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో సాధించిన నికర లాభం(రూ.130 కోట్లు)తో పోల్చితే 13 శాతం వృద్ధి సాధించామని టీవీఎస్‌ మోటార్‌ తెలిపింది. వివిధ విభాగాల అమ్మకాలు జోరుగా ఉండటంతో ఈ స్థాయిలో నికర లాభం పెరిగిందని వివరించింది. మొత్తం ఆదాయం రూ.3,457 కోట్ల నుంచి రూ.4,171 కోట్లకు పెరిగిందని పేర్కొంది. నిర్వహణ లాభం 45 శాతం వృద్ధితో రూ.306 కోట్లకు, నిర్వహణ లాభ మార్జిన్‌ 1.2 శాతం పెరిగి 7.4 శాతానికి చేరాయని తెలిపింది.  

ఎగుమతులు 52 శాతం అప్‌...
గత క్యూ1లో 7.85 లక్షలుగా ఉన్న మొత్తం టూవీలర్ల అమ్మకాలు ఈ క్యూ1లో 14 శాతం వృద్ధితో 8.93 లక్షలకు పెరిగాయని టీవీఎస్‌ మోటార్‌ తెలిపింది. బైక్‌ల అమ్మకాలు 17 శాతం, స్కూటర్ల అమ్మకాలు 12 శాతం పెరిగాయని పేర్కొంది. మొత్తం ఎగుమతులు 52 శాతం వృద్ధి చెందాయని తెలిపింది. ఈ కంపెనీ స్కూటీ, జూపిటర్‌ బ్రాండ్ల స్కూటర్లను, అపాచీ, స్టార్‌ బ్రాండ్‌ మోటార్‌బైక్‌లను విక్రయిస్తోంది. నికర లాభం 13 శాతం పెరగడంతో బీఎస్‌ఈలో ఈ షేర్‌ లాభపడింది. ఇంట్రాడేలో 6 శాతం లాభంతో రూ.560కు ఎగసిన ఈ షేర్‌ చివరకు 4 శాతం లాభంతో రూ.549 వద్ద ముగిసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement