టీవీఎస్ ఫీనిక్స్‌లో కొత్త వేరియంట్ | TVS Motor launches Phoenix 2015 edition at Rs 51990 | Sakshi
Sakshi News home page

టీవీఎస్ ఫీనిక్స్‌లో కొత్త వేరియంట్

May 1 2015 1:20 AM | Updated on Sep 3 2017 1:10 AM

టీవీఎస్ ఫీనిక్స్‌లో కొత్త వేరియంట్

టీవీఎస్ ఫీనిక్స్‌లో కొత్త వేరియంట్

టీవీఎస్ మోటార్ కంపెనీ 125 సీసీ ఫీనిక్స్ మోడల్‌లో కొత్త వేరియంట్‌ను గురువారం మార్కెట్లోకి తెచ్చింది.

ధర రూ. 51,999 -67 కి.మీ.మైలేజీ
చెన్నై: టీవీఎస్ మోటార్ కంపెనీ 125 సీసీ ఫీనిక్స్ మోడల్‌లో కొత్త వేరియంట్‌ను గురువారం మార్కెట్లోకి తెచ్చింది. దీని ధర రూ. 51,990 (ఎక్స్ షోరూమ్, న్యూఢిల్లీ)అని టీవీఎస్ మోటార్ కంపెనీ ప్రెసిడెంట్, సీఈఓ కె.ఎన్. రాధాకృష్ణన్ చెప్పారు. 67 కిమీ. మైలేజీనిస్తుందని వివరించారు. ఈకో థ్రస్ట్ ఇంజన్‌తో రూపొందించిన ఈ బైక్‌లో ప్రీమియం 3డీ లోగో, పూర్తి స్థాయి డిజిటల్ స్పీడోమీటర్, బ్యాటరీ తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు అప్రమత్తం చేసే లో బ్యాటరీ ఇండికేటర్ వంటి ఫీచర్లున్నాయి.

పార్కింగ్‌లో బైక్ ఎక్కడుందో సులువుగా తెలుసుకునే వెహికల్ లొకేషన్ అసిస్ట్ వంటి ఫీచర్ కూడా ఉందని వివరించారు. ఆరు రంగుల్లో ఈ బైక్ లభ్యమవుతుందని పేర్కొన్నారు. టీవీఎస్ ఫీనిక్స్‌ను మొదటగా 2012, సెప్టెంబర్‌లో విడుదల చేశామని, వినూత్నమైన ఫీచర్లతో ఇప్పుడు తాజా వేరియంట్‌ను అందిస్తున్నామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement