
టయోటా ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం
జపాన్ కు చెందిన టయోటా మోటార్ కార్పొరేషన్ తన ఉద్యోగులు ఇంటి వద్దనుంచే పనిచేసేలా ఓ కొత్త సిస్టమ్ ను తీసుకు రానుంది.
టోక్యో : జపాన్ కు చెందిన టయోటా మోటార్ కార్పొరేషన్, తన ఉద్యోగులు ఇంటి వద్దనుంచే పని చేసేలా ఓ కొత్త సిస్టమ్ ను తీసుకు రావాలని యోచిస్తోంది. టెలికమ్యూనికేట్ సిస్టమ్ ను కంపెనీలో ప్రవేశపెట్టి దాదాపు 25 వేల మంది ఉద్యోగులకు 'వర్క్ ఫ్రమ్ హోం'ను అందుబాటులోకి తీసుకురావాలని ప్లాన్స్ చేస్తోంది. దీంతో శ్రమ జీవితం మెరుగుపర్చి, ఉద్యోగులకు అనువైన వర్క్ సిస్టమ్ ను తీసుకురానుంది. ఈ ప్లాన్ గురించి టయోటా ప్రస్తుతం ట్రేడ్ యూనియన్లతో చర్చిస్తోందని, ఆగస్టు నుంచి ఈ ప్లాన్ అమలుల్లోకి రావచ్చని కంపెనీ అధికార ప్రతినిధి చెప్పారు.
ఈ ప్రొగ్రామ్ ను కంపెనీ ఉద్యోగుల్లో మూడింతలు మందికి విస్తరించి 72వేల మందికి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ను అవకాశం కల్పించనుంది. ఎవరైతే టయోటా కంపెనీలో ఐదేళ్లకంటే ఎక్కువకాలంగా పనిచేస్తున్నారో వారికి మాత్రమే ఈ సిస్టమ్ ను వర్తించనుంది. కంపెనీ ప్రధాన కార్యాలయం ఐచీలో పనిచేసే హెచ్ ఆర్, అకౌంట్స్, సేల్స్ డిపార్ట్ మెంట్, రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్, ఇతర ఇంజనీరింగ్ ఫీల్డ్స్ లో అందరికీ ఈ సిస్టమ్ వర్తింపచేయాలని ప్రయత్నిస్తోంది.
ఎక్కువ సమయం ఇంట్లోనే ఉండి పనిచేస్తూ.. వారంలో రెండు గంటలు మాత్రమే ఆఫీసుకు వెళ్లేలా ఈ ప్లాన్ ను రూపొందిస్తోంది. పురుష ఉద్యోగులు తమ పిల్లలతో సమయాన్ని గడిపే అవకాశం, మహిళా ఉద్యోగులు పెళ్లైన తర్వాత ఉద్యోగం మానేయాల్సిన అవసరం లేకుండా.. ఈ అనువైన వర్కింగ్ సిస్టమ్ తో తోడ్పడుతుందని టయోటా ఆశాభావం వ్యక్తం చేస్తోంది. దీంతో కంపెనీలో ఉద్యోగం మానేసే వారి శాతాన్ని తగ్తించవచ్చని చెప్పింది.