
యాప్ కీ కహానీ... టాప్-10 మొబైల్స్
నేను ఈ మధ్య మా సొంతూరు జమ్మలమడుగుకు వెళ్లాను. అక్కడ మా మామ నాకు ఒక స్మార్ట్‌ఫోన్ కొనిస్తానన్నాడు.
నేను ఈ మధ్య మా సొంతూరు జమ్మలమడుగుకు వెళ్లాను. అక్కడ మా మామ నాకు ఒక స్మార్ట్‌ఫోన్ కొనిస్తానన్నాడు. ఎంతైన పెద్దాయన, అభిమానంతో ఆయన కొంటానంటే కాదనలేక ఓకే అని చెప్పా. తర్వాత నాకు ఒక సమస్య ఎదురైంది. ఏ బ్రాండ్ ఫోన్ తీసుకోవాలో తెలియలేదు. స్నేహితులను సలహా అడిగితే ఒక్కొక్కరు ఒక్కో బ్రాండ్ పేరు చెబుతున్నారు. దీంతో నేను మరింత గందరగోళానికి గురయ్యా.. అప్పుడు వెంటనే బెస్ట్ సెల్లింగ్, పాపులర్ బ్రాండ్‌స మొబైల్స్ కోసం ఆన్‌లైన్‌లో సెర్చ్ చేయడం ప్రారంభించా. అన్ని ఈ-కామర్స్ సైట్లను జల్లెడ పట్టాను. కానీ ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాను.
అప్పుడే నాకు ‘టాప్-10 మొబైల్స్’ అనే యాప్ కంటపడింది. నా నచ్చే ఫోన్ ఏదైనా దొరుకుతుందేమోనని భావించి.. ఆ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా ఇన్‌స్టాల్ చేసుకున్నా. నేను ఊహించింది నిజమైంది. ఈ యాప్ కొనుగోలు చేయాలనుకుంటున్న వస్తువుకు సంబంధించి టాప్-10 ప్రొడక్టులను సిఫార్సు చేస్తుంది. ఉదాహరణకు మనం రూ.15,000లోపు మంచి ఎల్‌ఈడీ టీవీ కొనుగోలు చేయాలనుకుంటే.. ఆ ధరలోపు టాప్ సెల్లింగ్ టీవీలను మనకు చూపిస్తుంది. ఈ ఫీచర్ మాత్రమే కాకుండా యాప్‌లో మరికొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నారుు. అవేంటో చూద్దాం..
⇔ ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, అమెజాన్, ఈబే, పేటీఎం, షాప్‌క్లూస్ వంటి పలు ఈ-కామర్స్ సైట్లను శోధించి.. టాప్ సెల్లింగ్, పాపులర్ బ్రాండ్‌లను మనకు చూపిస్తుంది.
⇔ మనకు అనువైన ధర శ్రేణిలో నచ్చిన బ్రాండ్‌లోనే కావలసిన ఫీచర్లతో ప్రొడక్టులను సెర్చ్ చేయవచ్చు.
⇔ ప్రొడక్ట్ కంపారిజన్ ఆప్షన్ ఎలాగో ఉంది.
⇔ వస్తువు ధరలో హెచ్చుతగ్గులను చూపిస్తుంది. వాటి రివ్యూలను చదవొచ్చు.
ఈ యాపే ఎందుకు?
మైస్మార్ట్‌ప్రైజ్, స్మార్ట్‌ప్రిక్స్ వంటి పలు యాప్‌లు ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్నారుు. ఇవి ప్రొడక్టులను ఒకదానితో మరోకదాన్ని పోల్చి మనకు వాటి వివరాలను అందిస్తున్నారుు. ఇలాంటప్పుడు ఈ యాప్స్‌ను కాకుండా టాప్-10 మొబైల్స్ యాప్‌ను ఎందుకు ఉపయోగించాలి? అనే ప్రశ్న మీకు రావడం సహజమే. అరుుతే ఇక్కడ ఇవి వస్తువుల ధరను, డీల్స్‌ను మనకు తెలియజేస్తారుు. వస్తు కొనుగోలుకు ఇవి మాత్రమే సరిపోవు. వీటి కన్నా ముఖ్యమైనది ఒకటుంది.
అదే ఏ ప్రొడక్టును కొనుగోలు చేయాలో ఒక నిర్ణయానికి రావడం. దీని తర్వాతనే ధరను, డీల్స్‌ను పరిగణనలోకి తీసుకుంటాం. ఇటీవల నిర్వహించిన సర్వేలో ఆన్‌లైన్ షాపర్స్ వారి సమయంలో 80 శాతాన్ని ఏ వస్తువును కొనుగోలు చేయాలా? అనే అంశానికి కేటారుుస్తుంటే.. మిగిలిన 20 శాతాన్ని వస్తు ధర, డీల్స్‌కు వెచ్చిస్తున్నారనే అంశం వెల్లడరుు్యంది. ఈ అంశం ఆధారంగానే టాప్-10 మొబైల్స్ యాప్ రూపకల్పన జరిగింది. ఇక వచ్చే వారం మరొక మంచి యాప్‌తో మీ ముందుకు వస్తా. - సాక్షి, బిజినెస్ ప్రతినిధి