స్వల్పంగా పెరిగిన బంగారం ధర | The price of gold increased slightly | Sakshi
Sakshi News home page

స్వల్పంగా పెరిగిన బంగారం ధర

Jun 22 2015 1:18 AM | Updated on Apr 4 2019 3:49 PM

స్వల్పంగా పెరిగిన బంగారం ధర - Sakshi

స్వల్పంగా పెరిగిన బంగారం ధర

అంతర్జాతీయ ట్రెండ్ మెరుగ్గావుండటం, స్థానికంగా స్టాకిస్టులు, ఇన్వెస్టర్లు కొనుగోళ్లు జరపడంతో గతవారం బంగారం ధర స్వల్పంగా పెరిగింది.

అంతర్జాతీయ ట్రెండ్ మెరుగ్గావుండటం, స్థానికంగా స్టాకిస్టులు, ఇన్వెస్టర్లు కొనుగోళ్లు జరపడంతో గతవారం బంగారం ధర స్వల్పంగా పెరిగింది. అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచేఅంశమై ఆచితూచి వ్యవహరించనున్నట్లు ప్రకటించడంతో ప్రపంచమార్కెట్లో ఔన్సు బంగారం ధర నెలరోజుల తర్వాత తొలిసారిగా 1,200 డాలర్లస్థాయిని దాటింది. వారంలో 22 డాలర్లు పెరిగిన పుత్తడి 1,202 డాలర్ల వద్దకు చేరింది. దాంతో ముంబై బులియన్ మార్కెట్లో 99.9 స్వచ్ఛతగల పుత్తడి 10 గ్రాములకు వారంలో ఒకదశలో 27,000 స్థాయిని అధిగమించి, రూ. 27,030 వద్దకు చేరింది. అటుతర్వాత డాలరుతో రూపాయి విలువ బలపడిన కారణంగా 26,935 వద్ద ముగిసింది. గతవారంతో పోలిస్తే రూ. 95 వరకూ లాభపడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement