మెర్సిడెస్ కొత్త ఏ-క్లాస్ మోడల్ | The new Mercedes A-Class model | Sakshi
Sakshi News home page

మెర్సిడెస్ కొత్త ఏ-క్లాస్ మోడల్

Dec 9 2015 12:08 AM | Updated on Sep 3 2017 1:42 PM

మెర్సిడెస్ కొత్త ఏ-క్లాస్ మోడల్

మెర్సిడెస్ కొత్త ఏ-క్లాస్ మోడల్

జర్మనీ ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ ఇండియా తాజాగా తన కొత్త మెర్సిడెస్ బెంజ్ మోడల్ ఏ-క్లాస్‌ను మార్కెట్‌లో ఆవిష్కరించింది.

ముంబై: జర్మనీ ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ ఇండియా తాజాగా తన కొత్త కాంపాక్ట్ లగ్జరీ మోడల్ ఏ-క్లాస్‌ను మార్కెట్‌లో ఆవిష్కరించింది. దీని ప్రారంభ ధర రూ.24.95 లక్షలు (ఎక్స్ షోరూమ్ ముంైబె ). 1.6 లీటర్ 4 సిలిండర్ పెట్రోల్ వేరియంట్ (ఏ180 స్పోర్ట్) ధర రూ.24.95 లక్షలుగా, 2.2 లీటర్ 4 సిలిండర్ డీజిల్ వేరియంట్ (ఏ200 సీడీఐ) ధర రూ.25.95 లక్షలుగా ఉంటుందని మెర్సిడెస్ ఇండియా మేనేజింగ్ డెరైక్టర్, సీఈవో రోలాండ్ ఫోల్గేర్ తెలిపారు.
 
 డైనమిక్ స్పోర్టీ డిజైన్, హై గ్రేడ్ సెలెక్షన్ ఆఫ్ ఎక్విప్‌మెంట్, క్లాస్ పర్ఫామెన్స్, అంతర్జాతీయ స్థాయి ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రాజీపడని భద్రత సౌకర్యాలు తదితర ప్రత్యేకతలతో ఏ-క్లాస్ మోడల్ వినియోగదారుల ఎంపికలో ముందు వరుసలో నిలుస్తుందని వివరించారు. మెర్సిడె స్ కంపెనీ కార్ల విక్రయాలు జనవరి-సెప్టెంబర్ మధ్యకాలంలో 34 శాతం వృద్ధితో 10,079 యూనిట్లకు చేరాయి.

Advertisement
 
Advertisement
Advertisement