స్పెక్ట్రం వేలంతో రూ 5.22 లక్షల కోట్లు

Telecom Dept Approves Rs Five Trn Spectrum Sale - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా 22 టెలికాం సర్కిళ్ల పరిధిలో రూ 5.22 లక్షల కోట్లకు స్పెక్ట్రం కేటాయింపుల కోసం వేలం చేపట్టాలని డిజిటల్‌ కమ్యూనికేషన్స్‌ కమిషన్‌ (డీసీసీ) శుక్రవారం నిర్ణయించింది. స్పెక్ర్టం వేలం ప్రక్రియ మార్చి-ఏప్రిల్‌లో జరుగుతుందని భావిస్తున్నారు. టెలికాం శాఖ పరిధిలో అత్యున్నత నిర్ణాయక సంఘం డీసీసీ స్పెక్ర్టం వేలానికి సంబంధించి ట్రాయ్‌ ప్రతిపాదనకు డీసీసీ ఆమోదం తెలిపిందని మార్చి-ఏప్రిల్‌లో వేలం నిర్వహిస్తారని ఆశిస్తున్నామని టెలికాం కార్యదర్శి అన్షు ప్రకాష్‌ మీడియా సమావేశంలో వెల్లడించారు. 22 టెలికాం సర్కిళ్లలో జరిగే వేలానికి రూ 5,22,850 కోట్లు రిజర్వ్‌ ధరగా నిర్ధేశించామని చెప్పారు. ఇక కొచ్చి లక్షద్వీప్‌ మధ్య సబ్‌మెరైన్‌ ఫైబర్‌ కేబుల్‌ కనెక్టివిటీకి కూడా డీసీసీ ఆమోదం తెలిపింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top