అంచనాలను అధిగమించిన టెక్‌ మహీంద్ర

Tech Mahindra Earnings Beat Estimates In December Quarter - Sakshi

సాక్షి,ముంబై:  దేశీయ టెక్‌ దిగ్గజం టెక్‌ మహీంద్రా క్యూ3 ఫలితాల్లో అదరగొట్టింది.  ఈ ఏడాది మూడో క్వార్టర్‌ ఆర్థిక ఫలితాలను  సోమవారం విడుదల చేసింది. విశ్లేషకుల అంచనాలను బీట్‌  చేస్తూ క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో నికరలాభం 12.8 శాతం పెరిగి రూ .943 కోట్లకు పెరిగింది.  మొత్తం ఆదాయం  2.2 శాతం పెరిగి రూ. 7776 కోట్లకు  చేరింది. నిర్వహణ లాభం( ఇబిటా) రూ. 1256 కోట్లను తాకింది. ఇబిటా మార్జిన్లు 16.3 శాతంగా నమోదయ్యాయి. డాలర్ పరంగా రెవెన్యూ 2.5 శాతం పెరిగి 1,209 మిలియన్ డాలర్లకు చేరుకుందని  మార్కెట్‌ ఫైలింగ్‌లో కంపెనీ వెల్లడించింది.

వడ్డీకి ముందు ఆదాయం 17.9 శాతం పెరిగి 990 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఆపరేటింగ్ మార్జిన్ 12.7 శాతం పెరిగింది.  డిజిటల్‌  ట్రాన్సఫర్మేషన్‌పై తాము ఎక్కువగా దృష్టిపెట్టామని, భవిష్యత్ ఆవశ్యకతల కనుగుణంగా తమ ఉద్యోగులకు శిక్షణ ఇస్తున్నామని టెక్‌ మహీంద్ర వైస్‌ ఛైర్మన​ వినీత్ నయ్యర్ తెలిపారు. మరోవైపు సోమవారం మార్కెట్లు ముగిశాక ఫలితాలు  ప్రకటించడంతో మంగళవారం ట్రేడింగ్‌లో  సానుకూల ప్రభావం ఉండే అవకాశం ఉందని  విశ్లేషకులు పేర్కొన్నారు.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top