టెక్ మహీంద్ర ఆఫీసు మూత

Tech Mahindra campus sealed after COVID19 cases in a week - Sakshi

భువనేశ్వర్ : కరోనా మహమ్మారి ప్రకంపనలు  ప్రముఖ టెక్  సేవల సంస్థ టెక్ మహీంద్రను  తాకాయి. గత వారంలో ఏడుగురు ఉద్యోగులు కరోనా బారిన పడటంతో ఒడిశా రాజధాని నగరం భువనేశ్వర్ లోని టెక్ మహీంద్ర కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. భువనేశ్వర్ మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంపీ) మంగళవారం నగరంలోని టెక్ మహీంద్ర క్యాంపస్‌కు సీలు వేసింది. (బజాజ్ ఆటోను వణికిస్తున్న కరోనా)

కోవిడ్-19 కేసులను గుర్తించిన తరువాత శానిటైజేషన్ కోసం గురువారం వరకు సంస్థ కార్యాలయాన్ని 72 గంటలు మూసి వేసినట్లు బీఎంసీ నార్త్ జోనల్ డిప్యూటీ కమిషనర్ ప్రమోద్ కుమార్ ప్రస్టీ తెలిపారు. మొదటి కేసు జూన్ 29 న నమోదైనట్టు చెప్పారు. దీంతో  65 మంది ఉద్యోగులు హోం క్వారంటైన్ లో ఉన్నారని, అనుమానిత లక్షణాలు కనిపిస్తే  కరోనా పరీక్షలు చేయించుకుంటారని ఆయన వెల్లడించారు. అలాగే కాంటాక్ట్ ట్రేసింగ్ ద్వారా ఈ ఏడుగురు వ్యక్తులతో పరిచయం ఉన్న ఇతరులను వేరుచేయడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. (కరోనా వ్యాక్సిన్ : సినోవాక్ కీలక ప్రకటన)

కాగా ఒడిశాలో మంగళవారం  కేసుల సంఖ్య 10,000 మార్కును దాటింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 10,097  కరోనా  పాజిటివ్  కేసులు నమోదు కాగా  42 మంది మరణించారు.  గత 24 గంటల్లో ఖుర్దాలో నమోదైన 37 కేసుల్లో 26 కేసులు భువనేశ్వర్ కు చెందినవేనని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు. (కరోనా : శుభవార్త చెప్పిన మైలాన్‌)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top