టాప్ 10 కంపెనీల్లో ఐదు నష్టాల బాటే... | Sakshi
Sakshi News home page

టాప్ 10 కంపెనీల్లో ఐదు నష్టాల బాటే...

Published Sun, Apr 24 2016 4:50 PM

టాప్ 10 కంపెనీల్లో ఐదు నష్టాల బాటే...

న్యూఢిల్లీ : టాప్ 10 కంపెనీల్లో ఐదు కంపెనీలు తీవ్రంగా నష్టపోయాయట. ఏప్రిల్ 18 నుంచి 22 వరకూ గడిచిన వారంలో ఈ కంపెనీలు దాదాపు 38,968 కోట్ల మార్కెట్ వాల్యుయేషన్ ను కోల్పోయాయని గణాంకాలు తెలుపుతున్నాయి. బాగా పడిపోయిన కంపెనీల్లో ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) పరిస్థితి మరింత దారుణంగా ఉందని తెలుస్తోంది. ఈ వారంలో టీసీఎస్ మార్కెట్ వాల్యుయేషన్ రూ. 20,876.99 కోట్ల వరకూ పడిపోయి, రూ. 4,76,291.84 కోట్లగా నమోదైంది. టీసీఎస్ బాటలోనే రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, సన్ ఫార్మా, హెచ్ యూఎల్ నడిచాయి. అయితే ఇన్ఫోసిస్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు, ఓఎన్జీసీ, కోల్ ఇండియాలు ఈ వారంలో లాభాలనే నమోదు చేశాయి.
 

రిలయన్స్ మార్కెట్ వాల్యుయేషన్ రూ.8,651.8 కోట్లు పడిపోయి, రూ.3,36,593.97 కోట్లగా నమోదైంది. అదేవిధంగా ఐటీసీ సైతం రూ.4,224.79 కోట్లు తగ్గి, రూ.2,62,097.53 కోట్ల మార్కెట్ వాల్యుయేషన్ కలిగి ఉంది. సన్ ఫార్మా రే 2,791.74 కోట్లు, హెచ్ యూఎల్ మార్కెట్ వాల్యు రూ.2,423.61 కోట్లు తగ్గాయి. ఇన్ఫోసిస్ రూ.9601.23 కోట్లు, హెచ్ డీఎఫ్ సీ రూ. 2,793.64 కోట్లు, ఓఎన్జీసీ రూ. 2,694.98 కోట్లు మార్కెట్ క్యాప్ ను పెంచుకున్నాయి. అదేవిధంగా సెన్సెక్స్ సైతం వరుసగా రెండు వారాలు లాభాలనే నమోదుచేసింది. ఈ వారంలో 211 పాయింట్లు లాభాలను పండించి, 25,838.14గా నమోదైంది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement