భారత్‌లో ఇక వ్యాపారం సులభతరం | Tax system being overhauled to woo foreign investors: Arun Jaitley | Sakshi
Sakshi News home page

భారత్‌లో ఇక వ్యాపారం సులభతరం

Mar 15 2015 2:02 AM | Updated on Oct 2 2018 4:19 PM

భారత్‌లో ఇక వ్యాపారం సులభతరం - Sakshi

భారత్‌లో ఇక వ్యాపారం సులభతరం

భారత్‌లో వ్యాపార నిర్వహణ ప్రక్రియను సులభతరం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు.

ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ
లండన్: భారత్‌లో వ్యాపార నిర్వహణ ప్రక్రియను సులభతరం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. లండన్‌లో యూకే ఇండియన్ బిజినెస్ కౌన్సిల్- ఫిక్కీ సంయుక్త ఆధ్వర్యంలో ‘భారత్‌లో వ్యాపార అవకాశాలు’ అన్న అంశంపై ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జైట్లీ మాట్లాడుతూ, పెట్టుబడుల ఆకర్షణకు తమ ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుందని అన్నారు.

పన్నుల హేతుబద్దీకరణ, వీలైనంతమేర తగ్గింపు వంటి అంశాలపై దృష్టి పెట్టినట్లు తెలిపారు.
 
జీపీ హిందూజాకు ఎన్‌ఆర్‌ఐ అవార్డు
లండన్ పర్యటన సందర్భంగా ప్రముఖ పారిశ్రామికవేత్త జేపీ హిందూజాకు ఆర్థికమంత్రి జైట్లీ ఎన్‌ఆర్‌ఐ అవార్డును ప్రదానం చేశారు. వాణిజ్య రంగంలో సాధించిన గణనీయ విజయాలకు గాను జేపీ హిందూజా ఈ ఎన్‌ఆర్‌ఐ ఫౌండేషన్ అవార్డు పొందారు. ‘గారవి గుజరాత్’ మ్యాగజైన్‌సహా లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ హెడ్ (బిజినెస్) కమల్ హోతీ, బ్రిటన్ ప్రభుత్వ డీల్‌మేకర్ (ఫర్ ఇండియా) అల్ఫేస్ పటేల్‌లకు ఎన్‌ఆర్‌ఐ అవార్డులు లభించాయి.
 
యూబీఐ అనుబంధ బ్యాంక్ ప్రారంభం
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) బ్రిటన్‌లో తన ప్రత్యేక అనుబంధ బ్యాంకు విభాగాన్ని ప్రారంభించింది. దీనిని ప్రారంభించిన జైట్లీ, ఈ సందర్భంగా మాట్లాడుతూ,  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 7.5 శాతం వరకూ ఉంటుందని అన్నారు.
 
ఇన్వెస్టర్లపై ‘కెయిర్న్’ పన్ను  ప్రభావం లేదు

భారత్‌లో పెట్టుబడులపై ఇన్వెస్టర్ల ఉత్సాహాన్ని  ‘కెయిర్న్ పన్ను డిమాండ్’ నీరుగారుస్తోందన్న విమర్శలను ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తోసిపుచ్చారు. ఈ సమస్య గత ఎంతో కాలంగా ఉన్నదేనని, న్యాయ ప్రక్రియద్వారా ఇది పరిష్కారం అవుతుందని ఆయన అన్నారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి పలు వర్గాల నుంచి ఆసక్తి వ్యక్తమవుతోందని జైట్లీ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement