హెచ్‌పీసీఎల్‌ బంకుల్లో చార్జింగ్‌ స్టేషన్లు

Tata Power, HPCL join hands to set up EV charging stations - Sakshi

టాటా పవర్‌తో అవగాహనా ఒప్పందం

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్‌ వాహనాలకు (ఈవీ) సంబంధించి వాణిజ్య ప్రాతిపదికన చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు  హిందుస్తాన్‌ పెట్రోలియంతో (హెచ్‌పీసీఎల్‌) టాటా పవర్‌ జట్టు కట్టింది. హెచ్‌పీసీఎల్‌ రిటైల్‌ అవుట్‌లెట్స్‌తో పాటు దేశవ్యాప్తంగా ఇతరత్రా ప్రాంతాల్లో కూడా ఈవీ చార్జింగ్‌ స్టేషన్స్‌ను ప్రారంభించేందుకు ఇరు సంస్థలు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయని టాటా పవర్‌ వెల్లడించింది. దీని ప్రకారం ఎలక్ట్రిక్‌ కార్లు, రిక్షాలు, బైక్‌లు, బస్సులు మొదలైన వాహనాల చార్జింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అనువైన ప్రదేశాల్లో ఏర్పాటు చేయడం, అభివృద్ధి చేయడం, నిర్వహించడం తదితర అంశాల్లో ఇరు సంస్థలు కలిసి పనిచేస్తాయి.

ప్రతిపాదిత చార్జింగ్‌ స్టేషన్స్‌ ద్వారా దేశీయంగా ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం మరింతగా పెరిగేందుకు తోడ్పడగలమని టాటా పవర్‌ సీఈవో సిన్హా తెలిపారు. ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగానికి చార్జింగ్‌ సమస్యలే ప్రధాన అవరోధంగా ఉంటున్నాయని,  చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుతో ఈ సమస్య పరిష్కారం కాగలదని హెచ్‌పీసీఎల్‌ ఈడీ రజనీష్‌ మెహతా పేర్కొన్నారు.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top