సుజుకీ అప్‌.. హీరో డౌన్‌ | Suzuki Sales up And Hero Moto Corp Sales Down in Market | Sakshi
Sakshi News home page

సుజుకీ అప్‌.. హీరో డౌన్‌

Dec 3 2019 1:08 PM | Updated on Dec 3 2019 1:08 PM

Suzuki Sales up And Hero Moto Corp Sales Down in Market - Sakshi

న్యూఢిల్లీ: ఈ ఏడాది నవంబర్‌లో కూడా ఆటో రంగ అమ్మకాలు నెమ్మదించాయి.ద్విచక్ర వాహన విభాగంలో సుజుకీ మోటార్‌సైకిల్‌ విక్రయాలు 14.69 శాతం పెరిగాయి. దిగ్గజ కంపెనీలైన హీరో మోటోకార్ప్, బజాజ్‌ ఆటో అమ్మకాలు తగ్గాయి.  వాణిజ్య వాహన విభాగంలో అశోక్‌ లేలాండ్‌ 25 శాతం తగ్గుదలను నమోదుచేసింది. ప్యాసింజర్‌ వాహన విభాగంలో మారుతీ వంటి దిగ్గజ కంపెనీల అమ్మకాలు తగ్గిన విషయం తెలిసిందే కాగా, తాజాగా వెల్లడైన టయోటా విక్రయాలు సైతం 22 శాతం క్షీణతను నమోదుచేశాయి. 

Advertisement
 
Advertisement
Advertisement