రిలయన్స్‌,ఎన్‌హెచ్‌పీసీలపై ఫోకస్‌ | Sakshi
Sakshi News home page

రిలయన్స్‌,ఎన్‌హెచ్‌పీసీలపై ఫోకస్‌

Published Fri, May 29 2020 9:58 AM

Stocks in the news today - Sakshi

క్యూ4 ఫలితాలు: 3ఎం ఇండియా, దిలిప్‌ బుల్డికాన్‌, ఈక్విటాస్‌, ఎవరెస్ట్‌ ఇండస్ట్రీస్‌, జాగరన్‌ ప్రకాశన్‌, జూబిలెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌, కెఈసీ, లెమన్‌ ట్రీ, షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఆర్‌సీఎఫ్‌, వీ-మార్ట్‌, వోల్టాస్‌ కంపెనీలు మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసిక ఫలితాలను శుక్రవారం ప్రకటించనున్నాయి.

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌: అబుదాబికి రాష్ట్ర ఫండ్‌ ముబదాల ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ జియో ప్లాట్‌ఫామ్స్‌లో 1 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌: రూ.377 కోట్ల రుణాన్ని చెల్లించకపోడంతో విపుల్‌ లిమిటెడ్‌  యాజమాన్యంలోని గుర్‌గావ్‌ఆధారిత ప్రాజెక్ట్‌లో అమ్ముడు పోని 138 యూనిట్లు, 19 ఎకరాల స్థలాన్ని పీఎన్‌బీ హౌసింగ్‌​ ఫైనాన్స్‌ స్వాధీనం చేసుకుంది.

కర్ణాటక బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా:కేంద్ర బ్యాంక్‌ ఆదాయ గుర్తింపు, ఆస్తి వర్గీకరణ నిబంధనలు పాటించనందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌​ ఇండియా(ఆర్బీఐ).. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు రూ.5 కోట్ల జరిమానా విధించింది. 

ఫార్మా ప్లేయర్స్‌: పారాసిటమాల్‌ సంబంధించిన ఏపీఐలు(యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇంగ్రీడియంట్స్‌) ఎగుమతులపై ప్రభుత్వం ఆంక్షలను ఎత్తివేసింది.

క్యాడిలా హెల్త్‌కేర్‌:  హిమాచల్‌ ప్రదేశ్‌లోని బడ్డీ ఫెసిలిటీ సెంటర్‌కు అమెరికా హెల్త్‌ రెగ్యులేటరీ నుంచి ఎస్టాబ్లిష్‌మెంట్‌ ఇన్‌స్పెక‌్షన్‌ రిపోర్ట్‌(ఈఐఆర్‌) వచ్చిందని  హెల్త్‌కేర్‌ హెల్త్‌కేర్‌ వెల్లడించింది.

ఎన్‌హెచ్‌పీసీ: సోలార్‌ పవర్‌ వ్యాపారంలోకి అడుగుపెట్టేందుకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపినట్లు ఎన్‌హెచ్‌పీసీ వెల్లడించింది.

హెడల్‌బర్గ్‌ సిమెంట్‌ ఇండియా: మార్చితో ముగిసిన క్యూ4లో నికర లాభం 8.85 శాతం పెరిగి రూ.66.29 కోట్లకు చేరిందని ఈ కంపెనీ వెల్లడించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.60.90 కోట్లుగా ఉందని బీఎస్‌ఈకి ఇచ్చిన సమాచారంలో హెడల్‌బర్గ్‌ సిమెంట్‌ ఇండియా తెలిపింది.


 

Advertisement
 
Advertisement
 
Advertisement