
ముంబై : స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం ఆరంభ లాభాలను కోల్పోయి నష్టాల బాట పట్టాయి. పవర్ గ్రిడ్, ఏషియన్ పెయిట్స్, ఐటీసీ షేర్లు లాభపడుతుండగా టీసీఎస్, రిలయన్స్ ఇండస్ర్టీస్, బజాజ్ ఆటో నష్టపోతున్నాయి. పలు రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. మొత్తంమీద బీఎస్‌ఈ సెన్సెక్స్ 226 పాయింట్ల నష్టంతో 41,718 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 45 పాయింట్లు కోల్పోయి 12,307 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.