స్పైస్జెట్ లాభం 3 రెట్లు | SpiceJet quarterly profit climbs to Rs73 crore | Sakshi
Sakshi News home page

స్పైస్జెట్ లాభం 3 రెట్లు

May 20 2016 1:04 AM | Updated on Sep 4 2017 12:27 AM

స్పైస్జెట్ లాభం 3 రెట్లు

స్పైస్జెట్ లాభం 3 రెట్లు

స్పైస్‌జెట్ కంపెనీ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి మూడు రెట్లకు పైగా పెరిగింది.

వరుసగా ఐదో క్వార్టర్‌లోనూ లాభాలే
న్యూఢిల్లీ: స్పైస్‌జెట్ కంపెనీ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి మూడు రెట్లకు పైగా పెరిగింది. 2014-15 క్యూ4లో రూ.23 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.73 కోట్లకు పెరిగిందని స్పైస్‌జెట్ తెలిపింది. నిర్వహణ ఆదాయం అధికంగా ఉండటంతో వరుసగా ఐదో క్వార్టర్‌లోనూ లాభాలు సాధించామని కం పెనీ సీఎండీ అజయ్ సింగ్ చెప్పారు. మొత్తం ఆదాయం రూ.791 కోట్ల నుంచి రూ.1,475 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. మొత్తం వ్యయాలు రూ.889 కోట్ల నుంచి రూ.1,460 కోట్లకు ఎగిశాయని తెలిపారు. ఇక 2015-16 ఏడాదికి చూస్తే రూ.407 కోట్ల నికర లాభం వచ్చిందని అజయ్ సింగ్ చెప్పారు. 2014-15లో రూ.687 కోట్ల నష్టాలు వచ్చాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement