స్పైస్‌జెట్‌కు ఇంధన సెగ

SpiceJet sees improving outlook despite profit plunge - Sakshi

77 శాతం తగ్గిన నికర లాభం ∙రూ.2,531 కోట్లకు మొత్తం ఆదాయం

ముంబై: చౌక ధరల విమానయాన సంస్థ, స్పైస్‌జెట్‌ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక  కాలంలో 77 శాతం తగ్గింది. గత క్యూ3లో రూ.240 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.55 కోట్లకు చేరిందని స్పైస్‌జెట్‌ తెలిపింది. విమానయాన ఇంధనం ధరలు 34 శాతం పెరగడం,  రూపాయి 11 శాతం పతనం కావడం వంటి కారణాల వల్ల  ఈ స్థాయిలో నష్టాలు వచ్చాయని స్పైస్‌జెట్‌ చైర్మన్‌ అజయ్‌ సింగ్‌ తెలిపారు. మొత్తం ఆదాయం రూ.2,096 కోట్ల నుంచి రూ.2,531 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు.  

భవిష్యత్తు అంచనాలు ఆశావహమే.... 
ప్యాసింజర్‌ ఈల్డ్స్‌ 8 శాతం పెరగడం వల్ల నష్టాలు తగ్గాయని అజయ్‌ సింగ్‌ వివరించారు. ఇంధన వ్యయాలు భారీగా పెరిగినా, కరెన్సీ మారకం పతనమైనా, ఆదాయం పెరుగుదల, పటిష్టమైన వ్యయ నియంత్రణ పద్ధతుల కారణంగా ఈ క్యూ3లో మంచి ఫలితాలు సాధించామని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ రంగంలోని సమస్యలు ఇప్పుడిప్పుడే ఒక కొలిక్కి వస్తున్నాయని, భవిష్యత్తు అంచనాలు ఆశావహంగానే ఉన్నాయని పేర్కొన్నారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top