విజన్‌ ఫండ్‌ సీఈఓకు రెట్టింపు వేతనం | Soft Bank Doubles Rajeev Mishras Pay | Sakshi
Sakshi News home page

విజన్‌ ఫండ్‌ సీఈఓకు రెట్టింపు వేతనం

May 30 2020 6:29 PM | Updated on May 30 2020 6:40 PM

Soft Bank Doubles Rajeev Mishras Pay - Sakshi

ముంబై: జపాన్ దిగ్గజ సంస్థ సాఫ్ట్‌ బ్యాంక్‌ గ్రూప్‌కు చెందిన విజన్‌ ఫండ్‌ తీవ్ర నష్టాలను చవిచూస్తుంది. ప్రస్తుతం విజన్‌ ఫండ్‌ రూ.1700 కోట్ల నష్టాలను ఎదుర్కొంటుంది. ఈ సంక్షోభ సమయంలో విజన్‌ ఫండ్‌ సీఈఓ రాజీవ్‌ మిశ్రాకు రెట్టింపు వేతనాన్ని(కోటి యాబై లక్షల డాలర్లు) పెంచడం పట్ల మార్కెట్‌ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే విజన్‌ ఫండ్‌ పది శాతం ఉద్యోగులకు ఉద్వాసన పలకనుందన్న ఊహాగానాల నేపథ్యంలో రాజీవ్‌ మిశ్రాకు రెట్టింపు వేతనం పెంచడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. 

ప్రస్తుతం టోక్యో, కాలిఫోర్నియాలో విజన్‌ ఫండ్‌ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. తాజాగా సాప్ట్‌ బ్యాంక్‌ తిరిగి పుంజుకోవడానికి అక్షయ్‌ నహేతా సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా, సీనియర్‌ అడ్వైజర్‌గా కెంటారోను నియమించుకోనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. సీఈఓ వేతన పెంపుకు సంబంధించి కారణాలను మాత్రం కంపెనీ వెల్లడించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement