
టెక్ ప్రపంచానికి ప్రతి ఏడాది ద్వితీయార్ధం ఎంతో కీలకమని చెప్పవచ్చు. ప్రతి ఏడాది ఆరంభంలో ఆవిష్కరించిన సాంకేతిక పరిఙ్ఙానాన్ని వాణిజ్య ఉత్పత్తుల రూపంలో మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతాయి. మరీ ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ల తయారీ కంపెనీలకు ఈ రెండోభాగం అత్యంత కీలకమైనదిగా టెక్ నిపుణులు భావిస్తారు. ఈ క్రమంలో దిగ్గజ స్మార్ట్‌ఫోన్ కంపెనీలైన వివో, రియల్‌మి, వన్‌ప్లస్ లాంటి దిగ్గజ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు ఈ జూలైలో తమ స్మార్ట్‌ఫోన్ మోడళ్లను భారత మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు సిద్ధమయ్యాయి.
1. పోకో ఎం2 ప్రొ
షియోమి అనుబంధ సంస్థ పోకో సంస్థ నేడు (జూలై 7న) పోకో ఎం2 ప్రొను భారత్‌లో విడుదల చేయనుంది. ఈ కొత్తఫోన్లను ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేసుకొని అవకాశం కల్పించింది. ఈ ఫోన్ ధర రూ. 15వేల లోపు ఉండొచ్చు. ఈ మోడల్ రెడ్‌మీ నోట్ ప్రోకు రీబ్రాండ్ వర్షెన్‌గా ఉండొచ్చని భావిస్తున్నారు. డాట్ నాచ్ డిస్లే, క్వార్డ్ రేర్ కెమరాలు, స్నాప్‌డ్రాగ్ చిప్‌సెట్, 33వాట్ల ఫాస్ట్ ఛార్జర్‌తో పాటు ఫింగర్ ప్రింట్ స్కానర్లు ఫీచర్లను కలిగి ఉంది. వీటితో పాటుగా 6జీబీ ర్యామ్, 5020ఎంఏహెచ్ బ్యాటరీ, 6.67 అంగుళాల డాట్ డిస్‌ప్లే తో పాటు ఎఫ్‌హెచ్‌డీప్లస్ రెసెల్యూషన్, 64మెగా ఫిక్చెల్ బ్యాక్ కెమెరా ఉండొచ్చు. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 720జీ ప్రాసెసర్ ను ఇందులో అందించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆండ్రాయిడ్ 9.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఎమ్ఐయూఐ 10 కవర్‌తో కూడి ఉండొచ్చు.
2. వన్‌ప్లస్ నోర్డ్
ఈ జూలైలో విడుదల కావచ్చు. వన్‌ప్లస్ 8 సీరీస్‌లో తదుపరి వర్షెన్‌గా ఈ మోడల్ ఉండవచ్చని తెలుస్తోంది. ఇప్పటివరకు లాంచింగ్ తేది నిర్ణయించలేదు. అయితే ఈ వన్‌ప్లస్ నోర్డ్ స్మార్ట్‌ఫోన్‌ను మొదట భారత్, యూరప్, తర్వాత ఉత్తర అమెరికా లాంచ్ చేయాలని కంపెనీ భావిస్తోంది. భారత్‌లో త్వరలో ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో ప్రీ-బుకింగ్ చేసుకునేందుకు అవకాశం కల్పించనుంది. ఈ మోడల్ స్మార్ట్‌ఫోన్ ధర దాదాపు రూ.37వేలుగా ఉండొచ్చని టెక్ నిపుణులు అంచనావేస్తున్నారు.
3. వివో ఎక్స్50 సీరీస్
వివో ఎక్స్50 సిరీస్‌లో భాగంగా ఇప్పటికే మేలో వివో ఎక్స్ 50 ప్రో చైనాలో విడుదలైంది. ఇప్పుడు ఇదే సీరీస్‌లోని తదుపరి మోడళ్లైన ఎక్స్50 ప్రో, వివో ఎక్స్50 ప్రో ప్లస్‌లను జూలై మధ్యభాగంలో విడుదల చేయాలని కంపెనీ భావిస్తోంది. సంబంధిత వర్గాల సమాచారం మేరకు వో ఎక్స్50 ప్రో విడుదల అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎక్స్50 ప్రో స్పెసిఫికేషన్లు పరిశీలిస్తే..., స్నాప్‌డ్రాగన్ 765జీ చిప్‌సెట్ ఉంది. 6.56 అంగుళాల పూర్తి హెడ్ ప్లస్ ప్లస్ అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. 4,135 ఎంఏహెచ్ బ్యాటరీ, 33వాట్ల ఫ్లాష్ ఛార్జ్ సపోర్టుతో ఉంది. 48 మెగా ఫిక్చెల్ సామర్థ్యంతో వెనుక వైపు గింబల్ కెమెరా ఉంది. ఈ గింబల్ కెమెరా ద్వారా ఫొటోలు తీస్తే కెమెరా షేక్ కారణంగా ఫొటోలు షేక్ అవ్వడం, బ్లర్ అవ్వడం ఉండవని వివో తెలిపింది.
4. ఒప్పో రెనో 4 ప్రో
ఒప్పో గత నెలలో చైనాలో రెనో 4, రెనో 4 ప్రో స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది. మనదేశంలో ఈ నెలలో ఒప్పో రెనో 4 ప్రో విడుదల కానుంది. అయితే మనదేశంలో లాంచ్ అయ్యే ఒప్పో రెనో 4 ప్రో స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్లు చైనీస్ వేరియంట్ కంటే వేరుగా ఉండనున్నట్లు తెలుస్తోంది. భారత్‌లో విడుదలయ్యే ఒప్పో రెనో 4 ప్రో స్మార్ట్ ఫోన్ డిస్ ప్లే, రిఫ్రెష్ రేట్ వేరుగా ఉండనున్నాయి. డిస్‌ప్లే 120 హెర్ట్జ్ ఉండొచ్చు. చైనాలో లాంచ్ అయిన రెనో 4 ప్రోలో 90 హెర్ట్జ్ డిస్ ప్లేను అందించగా, మనదేశంలో లాంచ్ కానున్న ఫోన్ లో 120 హెర్ట్జ్ డిస్ ప్లే ఉండనున్నట్లు సమాచారం. 6.53 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ అమోఎల్ఈడీ డిస్ ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ గా ఉంది. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 765 5జీ ప్రాసెసర్ ను ఇందులో అందించారు. 8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉండనున్నాయి. వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ కాగా, 12 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 13 మెగా పిక్సెల్ టెలిఫొటో లెన్స్ కూడా ఉన్నాయి. ముందువైపు 32 మెగా పిక్సెల్ కెమెరా ఇందులో అందుబాటులో ఉంది.
5. రియల్‌మి 6ఐ, రియల్‌మి సీ11
రియల్ కంపెనీ ఈ జూలైలో తన అధునాతన మోడళ్లు రియల్‌మి 6ఐ, రియల్‌మి సీ11 స్మార్ట్‌ఫోన్లను ఈ జూలైలో విడుదల చేయనుంది. ఈ మేలో యూరప్‌లో విడుదలైన రియల్‌మి 6ఎస్ మోడల్ ఫోన్‌కు రియల్‌మి 6ఐ సరికొత్త వర్షెన్‌గా ఉండొచ్చు. మీడియాటెక్ హెలియో జీ90టీ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. 90 హెర్ట్జ్ డిస్ ప్లే, క్వాడ్ కెమెరా సెటప్, 64 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంది. దీంతోపాటు రియల్ మీ 6ఐ స్మార్ట్ ఫోన్ లో 30వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సామర్థ్యం, 4300 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉండనుంది. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.10,990గా ఉండవచ్చు అని తెలుస్తోంది.
ఇక రియల్‌మి సి11 స్పెషిఫికేషన్లను పరిశీలిస్తే.., మీడియాటెక్ హెలియో జీ35 చిప్‌సెట్ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. 5000 ఎమ్‌హెచ్‌ఏ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉండొచ్చు. 13 మెగా ఫిక్చెల్ డ్యూయెల్ కెమెరా సెట్‌అప్ కలిగి ఉండొచ్చు.