చిన్న ప్రాజెక్ట్‌లు.. పెద్ద లాభాలు!  | Small projects big gains | Sakshi
Sakshi News home page

చిన్న ప్రాజెక్ట్‌లు.. పెద్ద లాభాలు! 

Apr 14 2018 1:15 AM | Updated on Apr 14 2018 1:15 AM

Small projects  big gains - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పెద్ద గేటెడ్‌ కమ్యూనిటీలో ఇల్లు కొనాలా? లేక చిన్న స్థలంలో కట్టే ప్రాజెక్ట్‌లల్లో కొనాలా? అని గృహ కొనుగోలుదారులు సందిగ్ధ పడుతుంటారు. నిజం చెప్పాలంటే వీటికవే ప్రయోజనకరమైనవే. కానీ, కొంత ఎక్కువ లాభం చేకూరాలన్నా లేక త్వరగా గృహ ప్రవేశం కావాలన్నా సరే చిన్న ప్రాజెక్ట్‌ల్లో ఇల్లు కొనడమే ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.  చిన్న ప్రాజెక్ట్‌లు విస్తీర్ణంలోనే చిన్నవి.. వసతుల్లో మాత్రం పెద్ద ప్రాజెక్ట్‌లకు ఏమాత్రం తీసిపోవు. పైపెచ్చు అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఉండటం చిన్న ప్రాజెక్ట్‌లకు మరింత కలిసొచ్చే అంశం. బడా ప్రాజెక్టులు నిర్మించాలంటే కోట్లలో పెట్టుబడి కావాలి. అమ్మకాలు బాగుంటే పర్వాలేదు.. కానీ, సీన్‌ రివర్స్‌ అయ్యిందో ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడం కష్టం. దీంతో అటు కొనుగోలుదారులకు, ఇటు నిర్మాణ సంస్థలకూ తలనొప్పే. ప్రతికూల పరిస్థితుల్లో గొప్పకు పోయి పెద్ద మొత్తంలో బ్యాంకు రుణాలు తెచ్చి ప్రాజెక్ట్‌లు ప్రారం భించి అమ్మకాల్లేక బోర్డు తిప్పేసిన సంస్థలనేకం. అందుకే ఎలాంటి పరిస్థితుల్లోనైనా హాట్‌కేకుల్లా ప్రాజెక్ట్‌ అమ్ముడుపోవాలంటే చిన్న ప్రాజెక్ట్‌లే మేలని సూచిస్తున్నారు నిపుణులు. చేతిలో ఉన్న కొద్దిపాటి పెట్టుబడితో ప్రాజెక్ట్‌ను ప్రారంభించి.. పునాదుల్లోనే సగానికి పైగా అమ్మకాలు చేసుకునే వీలుంటుంది కూడా. 

ఏడాదిలో గృహప్రవేశం.. 
డిమాండ్‌ ఉన్న ప్రాంతాల్లో కొద్ది పాటి స్థలంలోనే చిన్నపాటి నిర్మాణాలు చేపడుతున్నాయి నిర్మాణ సంస్థలు. అప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతం కావటం, ఆధునిక వసతులూ కల్పిస్తుండటంతో కస్టమర్లు ఫ్లాట్లు కొనేందుకు ముందుకొస్తున్నారు. చిన్న ప్రాజెక్ట్‌ల మార్కెట్‌లో లాభాలు తక్కువే అయినా నిర్మాణం చేపట్టడానికి సిద్ధం. ఎందుకంటే ఈ నిర్మాణాలు ఏడాది లేక 15 నెలల్లో పూర్తవుతాయి. దీంతో త్వరగానే కొనుగోలుదారుల సొంతింటి కల నెరవేరడంతో పాటు మార్కెట్‌లో తమ కంపెనీ బ్రాండింగ్‌ పెరుగుతుందనేది నిర్మాణ సంస్థల వ్యూహం. అయితే చిన్న ప్రాజెక్ట్‌లు నిర్మించాలంటే స్థలం అంత సులువుగా దొరకదు. పోటీ ఎక్కువగా ఉంటుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement