నన్ను తిట్టండి.. మా అబ్బాయిని కాదు | Slam me if you want but not my son, tweets vijay mallya | Sakshi
Sakshi News home page

నన్ను తిట్టండి.. మా అబ్బాయిని కాదు

Mar 30 2016 11:46 AM | Updated on Sep 3 2017 8:53 PM

నన్ను తిట్టండి.. మా అబ్బాయిని కాదు

నన్ను తిట్టండి.. మా అబ్బాయిని కాదు

బ్యాంకులకు భారీ మొత్తంలో బాకీపడి.. భారతదేశం నుంచి పరారైపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా చాలాకాలం తర్వాత మళ్లీ ఓ అంశంపై స్పందించాడు.

బ్యాంకులకు భారీ మొత్తంలో బాకీపడి.. భారతదేశం నుంచి పరారైపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా చాలాకాలం తర్వాత మళ్లీ ఓ అంశంపై స్పందించాడు. కావాలంటే తనను తిట్టుకోవాలి గానీ, తన అబ్బాయిని మాత్రం ఏమీ అనొద్దని విజ్ఞప్తి చేశాడు. వివిధ బ్యాంకులకు రూ. 9వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సిన మాల్యా ఇక్కడి నుంచి ఇంగ్లండ్ పారిపోయిన విషయం తెలిసిందే. తన కొడుకు సిద్దార్థ మాల్యాను ఈ వివాదంలోకి లాగొద్దని అన్నాడు.

తన కొడుకు సిద్ మీద అనవసరంగా ద్వేషభావం చూపొద్దని, తిట్లు తిట్టొద్దని తెలిపాడు. అతడికి తన వ్యాపారంతో ఏమాత్రం సంబంధం లేదని, మీకు తప్పనిసరి అయితే తన మీద తిట్ల వర్షం కురిపించాలి గానీ అతడిమీద కాదని అన్నాడు. కావాలంటే తనను ఏమైనా అనొచ్చు గానీ కుర్రాడిని ఎందుకని ట్వీట్ చేశాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement