సెన్సెక్స్‌ 300 పాయింట్ల పతనం | Sakshi
Sakshi News home page

సెన్సెక్స్‌ 300 పాయింట్ల పతనం

Published Wed, Jan 2 2019 1:10 PM

Sensex Slips into 36 Thousand Level - Sakshi

సాక్షి, ముంబై: అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో భారీనష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌మార్కెట్లు మధ్యలో కొంత కోలుకున్నా, తిరిగి నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రారంభంలో 200పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌ అమ్మకాల ఒత్తిడితో మరింత కుదేలైంది. తీవ్ర ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్న మార్కెట్లలో సెన్సెక్స్‌ ప్రస్తుతం 318 పాయింట్ల నష్టంతో 35,937 వద్ద, 36వేల దిగువన ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం 105 పాయింట్ల పతనమై 10,805 వద్ద ట్రేడవుతోంది.  ఒక దశలో 10800 కిందికి చేరింది. ప్రధానంగా మెటల్‌, డిసెంబర్‌ అమ్మకాలు నెమ్మదించడంతో ఆటోరంగం దాదాపు 2శాతం బలహీనపడగా,  రూపాయి బలహీనత నేపథ‍్యంలో ఐటీ 1 శాతం పుంజుకుంది. 

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ అమ్మకాలు తీవ్ర నిరాశపర్చడంతో ఐషర్‌ మోటార్స్‌ పతనం 6. 9 శాతం పతనంకాగా.. తమిళనాడులో స్టెరిలైట్‌ ఫ్యాక్టరీ విషయంలో ఎదురు దెబ్బ తగలడంతో వేదాంతా  4శాతం పతనమైంది. ఇంకా ఎంఅండ్ఎం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హీరో మోటో, గెయిల్‌, హిందాల్కో, టాటా స్టీల్‌, హెచ్‌పీసీఎల్‌, పవర్‌గ్రిడ్‌ టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి. మరోవైపు టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, ఐసీఐసీఐ, ఇన్‌ఫ్రాటెల్‌, యస్‌ బ్యాంక్‌, టైటన్‌, విప్రో  లాభపడుతున్నాయి. 

Advertisement
Advertisement