స్టాక్ మార్కెట్ నష్టాల బాట..

ముంబై : జనవరి సిరీస్ డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగింపు ఒత్తిళ్లు, మెటల్, ఫార్మా, బ్యాంక్ షేర్లలో అమ్మకాలతో గురువారం స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో సాగుతున్నాయి. రియల్‌ఎస్టేట్ షేర్లలో కొద్దిగా కొనుగోళ్ల జోరు కనిపిస్తోంది. అంతర్జాతీయ ఆర్థిక మందగమనం, మార్కెట్ అంచనాలకు అనుగుణంగా బడ్జెట్ ఎంతవరకూ ఉంటుందనే ఆందోళన ఇన్వెస్టర్లను వెంటాడుతోంది. రిలయన్స్ ఇండస్ర్టీస్, టాటాస్టీల్, ఇండస్‌ఇండ్ షేర్లు నష్టపోతున్నాయి. మొత్తంమీద బీఎస్‌ఈ సెన్సెక్స్ 210 పాయింట్ల నష్టంతో 40,988 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, 55 పాయింట్లు కోల్పోయిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 12,074 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి