స్టాక్‌మార్కెట్‌లో కొనుగోళ్ల జోష్‌ | Sensex Hits Fresh Record High | Sakshi
Sakshi News home page

స్టాక్‌మార్కెట్‌లో కొనుగోళ్ల జోష్‌

Nov 4 2019 10:29 AM | Updated on Nov 4 2019 10:31 AM

Sensex Hits Fresh Record High - Sakshi

ఆసియా మార్కెట్ల సపోర్ట్‌తో స్టాక్‌ మార్కెట్లు సరికొత్త శిఖరాలను చేరాయి.

ముంబై : ఆసియా మార్కెట్ల సపోర్ట్‌తో పాటు రెండో త్రైమాసిక ఫలితాలు మెరుగ్గా ఉండటంతో స్టాక్‌ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. కొనుగోళ్ల మద్దతుతో సెన్సెక్స్‌ ఓ దశలో 40,434 పాయింట్ల సరికొత్త గరిష్టస్థాయికి చేరింది. ఐటీ, ఆటో షేర్లు మినహా అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్ల జోరు కనిపించింది. వేదాంత, టాటా స్టీల్‌ సహా పలు షేర్లు భారీగా లాభపడుతుండగా యస్‌ బ్యాంక్‌ షేర్‌ అమ్మకాల ఒత్తిడికి లోనయింది. మొత్తంమీద బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 150 పాయింట్ల లాభంతో 40,315 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, 54 పాయింట్లు పెరిగిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11,944 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement