గ్లోబల్‌ జోరు : దేశీయంగానూ లాభాలు

Sensex Ends Up 261 Pts As Global Peers Rally - Sakshi

ముంబై : అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధ భయాలు పెరుగుతున్నప్పటికీ, ప్రపంచ స్టాక్‌ మార్కెట్లన్నీ రికవరీ బాట పట్టాయి. ఆసియా, యూరప్‌తోపాటు దేశీయంగా మార్కెట్లు ర్యాలీ కొనసాగించాయి. ప్రపంచ మార్కెట్లన్నీ కొనుగోళ్లతో కళకళలాడాయి. దీంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు సెన్సెక్స్‌ 261 పాయింట్ల పైకి జంప్‌చేసి 35,547 వద్ద.. నిఫ్టీ 62 పాయింట్ల లాభంలో 10,772 వద్ద ముగిసింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కొటక్‌ మహింద్రా బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, యస్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌ టాప్‌ గెయినర్లుగా నిలువగా.. యూపీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, ఐఓసీలు ఒత్తిడిలో కొనసాగాయి. 

నిఫ్టీ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 85 పాయింట్లకు పైగా పైకి జంప్‌ చేసింది. ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌, లిబర్టీ షూస్‌, లైమన్‌ ట్రీ, సన్‌ టీవీ, జెట్‌ ఏయిర్‌వేస్‌, టాటా గ్లోబల్‌ బెవరేజస్‌ మాత్రమే 2 నుంచి 8 శాతం మధ్యలో పడిపోయాయి. అమెరికా, చైనాల మధ్య ట్రేడ్‌ వార్‌ ముదరడంతో, గత కొన్ని సెషన్ల నుంచి ప్రపంచమార్కెట్లన్నీ కుదేలవుతూ వస్తున్నాయి. కానీ నేటి ట్రేడింగ్‌లో ఆ నష్టాల నుంచి మార్కెట్లు కోలుకుని, కొనుగోళ్లను పండించాయి. దీంతో జపాన్‌ నిక్కీ, ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్‌ 200, దక్షిణ కొరియా కొప్సి 1 శాతం పెరగగా.. చైనా షాంఘై కాంపొజిట్‌ 0.31 శాతం లాభపడింది. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top