సెన్సెక్స్ కు 650 పాయింట్ల లాభం! | Sensex crosses 23,000 points mark | Sakshi
Sakshi News home page

సెన్సెక్స్ కు 650 పాయింట్ల లాభం!

May 9 2014 4:47 PM | Updated on Sep 2 2017 7:08 AM

సెన్సెక్స్ కు 650 పాయింట్ల లాభం!

సెన్సెక్స్ కు 650 పాయింట్ల లాభం!

ఎన్నికల తర్వాత నరేంద్రమోడీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చనే సానుకూల వార్తలతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు పరుగులు పెట్టాయి.

హైదరాబాద్: ఎన్నికల తర్వాత నరేంద్రమోడీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చనే సానుకూల వార్తలతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు పరుగులు పెట్టాయి.   ఇంట్రాడే ట్రేడింగ్ లో తొలిసారి సెన్సెక్స్ 23 వేల పాయింట్ల మార్కును అధిగమించింది. వారాంతపు ముగింపున 650 పాయింట్ల లాభంతో 22,994 వద్ద, నిఫ్టీ 198 పాయింట్ల వృద్దితో 6,858 వద్ద ముగిసాయి. 
 
ఓదశలో ఇంట్రాడే ట్రేడింగ్ లో సెన్సెక్స్ 23,048.49 గరిష్టస్థాయిని, 22317 పాయింట్ల కనిష్టస్థాయిని నమోదు చేసుకున్నాయి. 
 
ఇండెక్స్ షేర్లలో ఐడీఎఫ్ సీ అత్యధికంగా 8.06 శాతం లాభపడగా, అంబుజా సిమెంట్స్ 7.36, ఐసీఐసీఐ బ్యాంక్ 6.95, టాటా వపర్ 5.64, ఏసీసీ 5.62, కంపెనీల షేర్లు 5 శాతానికి పైగా లాభాల్లో కొనసాగుతున్నాయి. 
 
లుపిన్, డాక్టర్ రెడ్డీస్, టీసీఎస్, సన్ ఫార్మా కంపెనీల షేర్లు స్వల్ప నష్టాల్ని నమోదు చేసుకున్నాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement