శామ్‌సంగ్ నుంచి గెలాక్సీ ట్యాబ్ ఎస్2 | Samsung and Galaxy Tab S2 | Sakshi
Sakshi News home page

శామ్‌సంగ్ నుంచి గెలాక్సీ ట్యాబ్ ఎస్2

Sep 2 2015 11:53 PM | Updated on Sep 3 2017 8:37 AM

శామ్‌సంగ్ నుంచి గెలాక్సీ ట్యాబ్ ఎస్2

శామ్‌సంగ్ నుంచి గెలాక్సీ ట్యాబ్ ఎస్2

శామ్‌సంగ్ ..ప్రపంచంలోనే అతి పలుచని (5.6 మిల్లీమీటర్లు) ‘గెలాక్సీ ఎస్2’ ట్యాబ్‌ను మార్కెట్‌లో ఆవిష్కరించింది

 ధర రూ. 39,400
 
 బెంగళూరు :  శామ్‌సంగ్ ..ప్రపంచంలోనే అతి పలుచని (5.6 మిల్లీమీటర్లు) ‘గెలాక్సీ ఎస్2’ ట్యాబ్‌ను మార్కెట్‌లో ఆవిష్కరించింది. దీని ధర రూ.39,400. బంగారు, నలుపు, తెలుపు రంగుల్లో లభ్యంకానున్న ఈ ట్యాబ్లెట్లలో 32 జీబీ మెమరీ, 4జీ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. డాక్యుమెంట్లను క్రియేట్, ఎడిట్ చేసుకోవడానికి వీలుగా ఈ ట్యాబ్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సొల్యూషన్స్ ప్రి-లోడెడ్‌గా వస్తాయి. అలాగే ఎస్2 ట్యాబ్ ద్వారా స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్‌ను కంట్రోల్ చేయవచ్చు. ఎస్2 ట్యాబ్స్ అమ్మకాలు బుధవారం నుంచే ప్రారంభమైనట్లు శామ్‌సంగ్ ఇండియా ఎలక్ట్రానిక్స్ ప్రాడక్ట్ మార్కెటింగ్ డెరైక్టర్ మను శర్మ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement