
సాక్షి, హైదరాబాద్: మెట్రో రైలు పరుగులతో హైదరాబాద్ రియల్టీ పట్టాలెక్కేసింది. స్థానిక ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు, ప్రోత్సాహకాలతో కొత్త ప్రాజెక్ట్‌ల ప్రారంభాలూ పెరిగాయి. భవిష్యత్తులో ధరలు పెరగనున్న నేపథ్యంలో ప్రస్తుతం కొనుగోళ్లూ వృద్ధి చెందాయి. ఇలాంటి సానుకూల పరిస్థితుల్లో నగరంలో తక్కువ ధరలో ప్రాపర్టీని సొంతం చేసుకోవటమెలా? అభివృద్ధి చెందే ప్రాంతాల్లో అందుబాటు గృహాలున్నాయా? నివాస, వాణిజ్య, రిటైల్ ప్రాపర్టీల్లో పెట్టుబడులు పెట్టాలంటే ఎలా.. వంటి సవాలక్ష సందేహాలొస్తాయి.
వీటన్నింటికీ ఒకే వేదికగా పరిష్కారం చూపించేందుకు మరోసారి నగరవాసుల ముందుకురానుంది ‘సాక్షి మెగా ప్రాపర్టీ షో’! మాదాపూర్‌లోని హైటెక్స్ సమీపంలోని సైబర్ కన్వెన్షన్‌లో మే 19, 20 తేదీల్లో జరగనున్న ఈ ప్రదర్శనలో నగరానికి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థలు పాల్గొననున్నాయి. స్టాళ్ల ఏర్పాటుకు ఆసక్తి ఉన్నవాళ్లు 99122 20380, 87902 30124లో సంప్రదించవచ్చు.