Sakshi News home page

ఇవీ అంబానీ లెక్కలు

Published Sat, Jul 22 2017 4:39 PM

ఇవీ అంబానీ లెక్కలు

న్యూఢిల్లీ : పోటీ సంస్థలకు గట్టి షాకిచ్చేలా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ శుక్రవారం సమావేశంలో బ్లాక్‌బస్టర్‌ ప్రకటనలు చేశారు. జీరోకే జియో ఫీచర్‌ ఫోనంటూ ఇటు టెలికం కంపెనీల నుంచి అటు మొబైల్‌ సంస్థల వరకు గుండెల్లో హడలు పుట్టించారు. జియో 4జీ ఫీచర్‌ ఫోన్‌ కొన్నవారికి ఉచిత వాయిస్‌ కాల్స్‌, చౌకైన డేటా ప్యాకేజీలు అందుబాటులోకి వస్తున్నాయి. ఒక్క కస్టమర్లకు మాత్రమే కాక, ఇన్వెస్టర్లకు బంపర్‌ కానుక ఇచ్చారు.
 
ఒక షేరుకు మరో షేరును బోనస్‌గా ఇ‍వ్వనున్నట్టు ప్రకటించడంతో కంపెనీ 40వ వార్షిక సర్వసభ్య సమావేశం దద్దరిల్లింది. మొత్తంమీద ఈసారి ఏజీఎంలో ముకేశ్‌ ప్రసంగం, అనూహ్య నిర్ణయాలు ఇన్వెస్టర్లకు, కస్టమర్లకు ఎంతో సంతోషాన్ని కలిగించాయి. ఆయిల్‌ నుంచి టెలికాం వరకు వ్యాపారాలు నిర్వహిస్తున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లెక్కలు గురించి, ఈ సమావేశంలోనే ముఖేష్‌ ప్రకటించారు. ఆయన ప్రకటించిన లెక్కలేమిటో ఓసారి మీరే చూడండి...
 
రూ.3.3 ట్రిలియన్‌: గత 5 ఏళ్ల నుంచి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మూలధన వ్యయాలు
రూ.12.5 బిలియన్‌ : జియో యూజర్లు ఒక్కో నెలలో వాడే డేటా వాడకం(జీబీలో). ఆరునెలల్లో ఆరింతలు పెరిగింది.
రూ.2.5 బిలియన్‌ : ప్రతిరోజూ జియో యూజర్లు చేసే వాయిస్‌, వీడియో కాల్స్‌ నిమిషాలు
500 మిలియన్‌ : జియో ఫోన్‌ టార్గెట్‌గా పెట్టుకున్న  ఫీచర్‌ ఫోన్‌ యూజర్లు
100 మిలియన్‌ : జియో చెల్లింపు కస్టమర్లు.
5 మిలియన్‌ : ప్రతి వారం జియో ఫోన్‌ విక్రయానికి పెట్టుకున్న టార్గెట్‌
రూ.16.54 లక్షలు : 1977లో రిలయన్స్‌ షేర్లలో రూ.1000 పెట్టుబడి పెడితే, ఇప్పుడు వచ్చే విలువ
10,000 సార్లు : గత 40 ఏళ్లలో సంస్థ నికరలాభాల్లో వృద్ధి
4700 సార్లు : 1977 నుంచి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వృద్ధి
రూ.153 : జియో ఫోన్‌ కస్టమర్లు అపరిమిత డేటా వాడకానికి చేయించుకోవాల్సిన నెలవారీ టారిఫ్‌
రూ.0 : జియో ఫోన్‌ ధర 
 

Advertisement

What’s your opinion

Advertisement