జియో ప్రీపెయిడ్‌ కస‍్టమర్లకు డిస్కౌంట్‌

Reliance Jio rolls out discounts for prepaid customers - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో  తన పాపులర్‌  ప్రీ పెయిడ్‌ ప్లాన్‌పై  డిస్కౌంట్‌ను ప్రకటించింది. ముఖ్యంగా అత్యధికంగా అమ్ముడు పోతున్న ప్రీపెయిడ్ ప్లాన్‌ రూ .399 పై తక్షణ డిస్కౌంట్ ను ఆఫర్‌ చేస్తోంది. రూ.399ల రీచార్జ్‌ ప్లాన్‌ 100 రూపాయల డిస్కౌంట్‌తో  ఇపుడు రూ.299లకే లభ్యం కానుంది.

లిమిటెట్‌ పీరియడ్‌  ఆఫర్‌గా దీన్ని వినియోగదారులకు అందిస్తోంది. జూన్‌ 1 నుంచి 15 తేదీ వరకు మాత్రమే ఈ డిస్కౌంట్‌ ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది. మై జియో యాప్‌ లోని ఫోన్‌పే ద్వారా రీచార్జ్‌ చేసుకుంటే 50రూపాయల క్యాష్‌ బ్యాక్‌ వోచర్‌, 50 రూపాయల రీచార్జ్‌ కూపన్‌ను అందిస్తుంది.  కాగా రూ.399 ప్లాన్‌లో 126 జీబీ డేటాను జియో అందిస్తుంది. ఈ  ప్లాన్‌ వాలిడిటీ 84రోజులు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top