తగ్గిన జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా నష్టాలు | Reduced GMR infra losses | Sakshi
Sakshi News home page

తగ్గిన జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా నష్టాలు

Nov 15 2017 11:45 PM | Updated on Nov 15 2017 11:45 PM

Reduced GMR infra losses - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికం కన్సాలిడేటెడ్‌ ఫలితాల్లో జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ నష్టాలు తగ్గాయి. గత ఆర్ధిక సంవత్సరం క్యూ2లో రూ.893.37 కోట్ల నష్టాలను చవిచూస్తే.. ఇప్పుడవి 54 శాతం తగ్గుదలతో రూ.404.46 కోట్లకు తగ్గాయి. జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా మొత్తం ఆదాయం గతేడాది క్యూ2లో రూ. 2,264 కోట్ల నుంచి 13 శాతం తగ్గుదలతో రూ.1,974 కోట్లకు చేరింది. విమానాశ్రయ విభాగం మాత్రం క్యూ2లో రూ.282 కోట్ల లాభాన్ని ఆర్జించింది. విద్యుత్‌ విభాగం మాత్రం రూ.219 కోట్ల నష్టాన్ని చవిచూసింది.  

Advertisement
 
Advertisement
Advertisement