దూసుకుపోతున్న షావోమి: న్యూ రికార్డ్స్‌ | Redmi 5A India Sales Cross 1 Million Units Within a Month of Launch, Says Xiaomi | Sakshi
Sakshi News home page

దూసుకుపోతున్న షావోమి: న్యూ రికార్డ్స్‌

Jan 11 2018 12:34 PM | Updated on Jan 11 2018 12:45 PM

Redmi 5A India Sales Cross 1 Million Units Within a Month of Launch, Says Xiaomi   - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ మొబైల్‌ మేకర్‌ షావోమి దూసుకుపోతోంది.  కొత్త సంవత్సరంలో కొత్త రికార్డులతో  ఇండియాలో తన సత్తా చాటుతోంది. అమెజాన్‌లో   టాప్‌ సెల్లింగ్‌ బ్రాండ్స్‌  స్మార్ట్‌ఫోన్‌​ విక్రయాల్లో టాప్‌ ప్లేస్‌లో నిలిచింది. ఈ విషయాన్ని స్వయంగా షావోమి  ఇండియా హెడ్‌  మను కుమార్‌ జైన్‌ ట్విటర్‌లో ప్రకటించారు.  అమెజాన్‌లో సేల్‌ అవుతున్న 6 టాప్‌  స్మార్ట్‌ఫోన్లలో 5 తమవే(షావోమి) అని ట్వీట్‌ చేశారు. మరోవైపు రెడ్‌ మి 5 ఎ విక్రయాల్లో  దుమ్ము రేపుతోంది. షావోమి పాపులర్‌ మోడల్‌ దేశ్ కా స్మార్ట్‌ఫోన్ పేరిట రెడ్‌మీ 5ఎ భారీ సేల్స్‌ను నమోదు చేసింది.  లాంచ్‌ అయిన నెలరోజులలోపే తమ ఎంట్రీ లెవల్‌ స్మార్ట్‌ ఫోన్‌  భారత్‌లో మిలియన్‌కు పైగా విక్రయాలను సాధించిందని  జైన్‌  వెల్లడించారు.

లాంచ్‌ అయిన నెల రోజుల వ్యవధిలోనే అన్ని మాధ్యమాల్లోనూ కలిపి ఏకంగా 10 లక్షలకు పైగా యూనిట్లు అమ్ముడైనట్టు జైన్‌ ట్వీట్‌ చేశారు.  ప్రస్తుతం ఈ ఫోన్ ఆన్‌లైన్‌తోపాటు, ఆఫ్‌లైన్ స్టోర్స్‌లోనూ లభ్యం.  గతేడాది డిసెంబర్ 7వ తేదీన  5ఎ స్మార్ట్‌ఫోన్‌ను 2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో విడుదల చేసింది.  మరోవైపు 2జీబీ ర్యామ్ వేరియెంట్‌పై మొదటి 50 లక్షల యూనిట్లకు రూ.1000 డిస్కౌంట్‌ను అందిస్తున్న నేపథ్యంలో  రెడ్‌మీ 5ఎ స్మార్ట్‌ఫోన్ రూ.4,999 లకు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే.

రెడ్‌మీ 5ఎ  పీచర్లు
5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే
1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్
2/3 జీబీ ర్యామ్
16/32 జీబీ స్టోరేజ్
128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
13 ఎంపీ రియర్‌ కెమెరా
5ఎంపీ సెల్ఫీ కెమెరా
3000 ఎంఏహెచ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement