రియల్‌మి తొలి ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌

Realme X2 Pro European pre-orders scheduled to start on November 4 - Sakshi

రియల్ మీ సంస్థ కూడా ఫ్లాగ్‌షిప్ మొబైల్ ఫోను మార్కెట్‌లోకి ఎంట్రీ  ఇస్తోంది. ఈ సెగ్మెంట్‌లో తన మొట్టమొదటి డివైస్‌ రియల్ మి ఎక్స్‌ 2 ప్రొను  సంస్థ ప్రకటించింది.  చైనా, తదితర మార్కెట్లలో నవంబరు 4 నుంచి ప్రీ ఆర్డర్‌కు ఈ  స్మార్ట్‌ఫోన్‌ లభిస్తుండగా, భారత మార్కెట్లో మాత్రం  నవంబరు 20న  ఆవిష్కరించనుంది. 8జీబీ ర్యామ్‌, 123 జీబీ స్టోరేజ్‌, 6జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ రెండు వేరియంట్లలో ఇది లభ్యంకానుంది.  భారత్‌లో డిసెంబర్ మొదటి వారంలో అమ్మకాలు ప్రారంభం కావచ్చునని తెలుస్తోంది.

రియల్‌మి ఎక్స్‌ 2  ప్రొ ఫీచర్లు
6.5-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే
1080 x 2400 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
స్నాప్‌డ్రాగన్‌ 855 ప్లస్‌ సాక్‌
6జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌
64 +8+13+2  ఎంపీ రియర్‌ కెమెరా, 
16ఎంపీ సెల్పీకెమెరా
4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ 

ఇన్ డిస్‌ప్లే వేలిముద్ర సెన్సార్‌, వూక్‌ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నలాజీ ఇతర ప్రధాన ఫీచర్లుగా ఉండనున్నాయి. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top