మోడీతో రాజన్ భేటీ | RBI governor Raghuram Rajan meets Narendra Modi | Sakshi
Sakshi News home page

మోడీతో రాజన్ భేటీ

Jun 2 2014 3:00 AM | Updated on Jul 6 2019 3:20 PM

మోడీతో రాజన్ భేటీ - Sakshi

మోడీతో రాజన్ భేటీ

ద్రవ్య విధాన సమీక్ష మంగళవారం నిర్వహించనున్న నేపథ్యంలో రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురామ్ రాజన్ ప్రధాని నరేంద్ర మోడీతో ఆది వారం భేటీ అయ్యారు.

న్యూఢిల్లీ: ద్రవ్య విధాన సమీక్ష మంగళవారం నిర్వహించనున్న నేపథ్యంలో రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురామ్ రాజన్ ప్రధాని నరేంద్ర మోడీతో ఆది వారం భేటీ అయ్యారు. స్థూల ఆర్థిక పరిస్థితులు, ధరల పెరుగుదలకు సంబంధించిన అంశాలపై వారు చర్చించినట్లు తెలిసింది. రాజన్ సుహృద్భావపూర్వకంగానే మోడీని కలుసుకున్నారని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.

కేంద్ర ఆర్థిక శాఖ నూతన మంత్రి అరుణ్ జైట్లీని కూడా రాజన్ గత వారంలో కలుసుకున్నారు. 2013-14లో దేశ ఆర్థిక వృద్ధి రేటు 4.7% నమోదైంది. గత మార్చితో ముగిసిన త్రైమాసికంలో వృద్ధి రేటు 4.6 శాతమే. ప్రధానిగా మోడీ మే 26న బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆర్‌బీఐ తొలి ద్రవ్య విధాన సమీక్ష ఈ నెల 3న జరగనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement