బ్యాంక్‌ లోన్‌ ఉంటే డెబిట్‌ కార్డు సౌకర్యం: ఆర్‌బీఐ 

RBI Allows Banks To Issue Debit Cards To Overdraft Account - Sakshi

ముంబై : ఎలక్ట్రానిక్‌ కార్డుల జారీ అంశంలో ఆర్‌బీఐ పలు నిబంధనలను సడలించింది. ఇందులో భాగంగా ఓవర్‌ డ్రాఫ్ట్‌ ఖాతా కలిగిన వ్యక్తులు కూడా డెబిట్‌ కార్డులను పొందడానికి అవకాశం లభించింది. ఆర్‌బీఐ 2015లో జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం బ్యాంకుల్లో ఖాతా కలిగిన వారికే ఎలక్ట్రానిక్‌ కార్డులను జారీ చేయాల్సి ఉంది. అయితే, వీటిలో పలు మార్పులు చేసిన ఆర్‌బీఐ.. వ్యక్తిగత రుణాలను కలిగిన ఉన్నవారికి (కేవలం వ్యక్తులకే) డెబిట్‌ కార్డులను జారీ చేయవచ్చనే వెసులుబాటు ఇచ్చింది. ఈ కార్డులను కేవలం ఆన్‌లైన్, నగదురహిత లావాదేవీలకు మాత్రమే వినియోగించాలి. వినియోగం కోసం చెక్‌లు, తగిన నిల్వను ఉంచాల్సి ఉంటుందని వివరించింది.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top