మార్కెట్‌లోకి రేంజ్‌ రోవర్‌ వెలార్‌

Range Rover Vellar into the market - Sakshi

ప్రారంభ ధర రూ.78.83 లక్షలు

న్యూఢిల్లీ: టాటా మోటార్స్‌ అనుబంధ సంస్థ జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌) తాజాగా తన కొత్త ఎస్‌యూసీ మోడల్‌ ‘రేంజ్‌ రోవర్‌ వెలార్‌’ను భారత మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.78.83 లక్షల నుంచి రూ.1.38 కోట్ల శ్రేణిలో (ఎక్స్‌షోరూమ్‌ ఢిల్లీ) ఉంది. వచ్చే ఏడాది జనవరి చివరి నుంచి ఈ మోడళ్లను కస్టమర్లకు డెలివరీ చేస్తామని కంపెనీ తెలిపింది. ‘రేంజ్‌ రోవర్‌ పోర్ట్‌ఫోలియోలో రేంజ్‌ రోవర్‌ ఎవొక్యూ, రేంజ్‌ రోవర్‌ స్పోర్ట్‌ మధ్య ఉన్న అంతరాన్ని వెలార్‌ మోడల్‌ భర్తీ చేస్తుంది. దీంతో ఎస్‌యూవీ విభాగం మరింత బలోపేతమౌతుంది’ అని జేఎల్‌ఆర్‌ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ రోహిత్‌ సూరి తెలిపారు. ఈ కొత్త మోడల్‌ 2 లీటర్‌ పెట్రోల్, 2 లీటర్‌ డీజిల్, 3 లీటర్‌ డీజిల్‌ అనే మూడు ఇంజిన్‌ ఆప్షన్లలో కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని ఎండీ రోహిత్‌ సూరి ఈ సందర్భంగా తెలిపారు.

జేఎల్‌ఆర్‌ విక్రయాల్లో 10 శాతం వృద్ధి
జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌) విక్రయాలు నవంబర్‌ నెలలో 10 శాతం వృద్ధితో 52,332 యూనిట్లకు పెరిగాయి. దీనికి కొత్త ల్యాండ్‌ రోవర్‌ డిస్కవరీ, రేంజ్‌ రోవర్‌ వెలార్‌ ఆవిష్కరణలు బాగా దోహదపడ్డాయి. ‘నవంబర్‌లో బలమైన వృద్ధి సాధించాం. అంతర్జాతీయంగా ప్రధాన మార్కెట్లలోని విక్రయాల్లో వృద్ధి నమోదయ్యింది’ అనిగ్రూప్‌ ఎస్‌ఓడీ గాస్‌ తెలిపారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top